మణిపూర్లో బాంబు పేలుడు: ముగ్గురికి గాయాలు
పశ్చిమ మణిపూర్ జిల్లాలో మంత్రిపుక్కిరి ప్రాంతంలో గత రాత్రి శక్తిమంతమైన బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం ఇక్కడ వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న హోటల్లో ఆ బాంబు పేలడం వల్ల ఆ హోటల్ సిబ్బంది ముగ్గురు గాయాలపాలైయ్యారన్నారు. అయితే వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారమని తెలిపారు.
అయితే వారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. బాంబు పేలుడుపై కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. హోటల్ యజమానినికి తీవ్రవాదులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అతడు నిరాకరించడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.