మహానందిలో రేపటి నుంచి ఉచిత దర్శనం
మహానంది పుణ్యక్షేతంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇక చెల్లించనక్కర్లేదు. భక్తులు ఉచితంగా దర్శించుకునేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహానంది పుణ్యక్షేత్ర చైర్మన్ మాన్యం ప్రసాదరావు, ఈవో శంకర వరప్రసాద్, పాలకమండలి సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ఆలయ అధికారులు సాధారణ దర్శనం కోసం రూ.10 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఉచితంగా మార్చారు. ప్రత్యేక దర్శనం రేట్లు ఎప్పటిలానే ఉన్నాయి. కొత్తగా క్షీరాభిషేకంను ప్రారంభించారు. దీని ధర రూ.200లుగా నిర్ణయించారు.