మలయాళం హిట్‌తో...
‘‘నేను తెలుగులో తొలిసారి డబ్ చేసిన ‘సింధూరపువ్వు’ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన మరో డబ్బింగ్ చిత్రం ‘సాహసఘట్టం’ హిట్ అయింది. తాజాగా డబ్ చేస్తున్న ‘మన్యం పులి’తో మూడో హిట్ వస్తుందను కుంటున్నా’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు.
మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ముఖ్య పాత్రలో వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’ను ‘మన్యం పులి’ పేరుతో కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘మలయాళంలో వందకోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రమిది. తెలుగులో కూడా హిట్ సాధించాలి’’ అని సమర్పకుడు తొమిచన్ ముల్కపాదమ్ అన్నారు. హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బాపటేల్ పాల్గొన్నారు.