కొరియా 'మారథాన్-2016'లో తెలుగు తేజాలు
సియోల్ : దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని యోయినారు నగరంలో శనివారం తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కొరియా (టాస్క్ ) ఆధ్వర్యంలో 21వ 'బడా మారథాన్ -2016' నిర్వహించారు. ఇందులో సుమారు ఆరువేల మంది పాల్గొన్నారు. అలాగే స్పోర్ట్స్ క్లబ్, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఈ బడా మారథాన్లో పాల్గొన్నారు.
పతకాలు కూడా సాధించారు. 5కే, 10కే, 21కే (హాఫ్), 42కే (ఫుల్ మారథాన్)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని రక్షించుకుందామంటూ వారు నినదించారు.