marder
-
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో దోషిగా డెరిక్ చౌవిన్
-
భర్తని చంపిన భార్య ...
-
రఘునందన్‌కు 23న మరణశిక్ష!
వాషింగ్టన్: అమెరికాలో పది నెలల చిన్నారి శాన్వీతో పాటు ఆమె నాయనమ్మ సత్యవతి(61)ని 2012లో అతి కిరాతకంగా హత్యచేసిన కేసులో భారత సంతతి అమెరికన్ రఘునందన్ యండమూరి(32)కి ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలుచేయనున్నట్లు స్థానిక జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో రఘునందన్ డబ్బుకోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు కోర్టుకు చెప్పారు. తొలుత ఈ హత్యలు చేసింది తానేనని అంగీకరించిన రఘునందన్ తర్వాత మాట మార్చాడు. తాను కేవలం దొంగతనానికి మాత్రమే పాల్పడ్డాననీ, ఈ హత్యలకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. ఈ హత్యల్ని ఇద్దరు అమెరికన్లు చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ నుంచి ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ అయింది. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా కోర్టు చివరికి 2014, అక్టోబర్ 14న రఘునందన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ 2015లో విధించిన మారిటోరియం కారణంగా ఈ శిక్ష అమలు వాయిదా పడే అవకాశముందని జైలు అధికారులు వెల్లడించారు. ఒకవేళ గవర్నర్ శిక్ష అమలు కోసం నిర్ణీత గడువులోగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుంటే జైళ్లశాఖ కార్యదర్శి 30 రోజుల్లోగా దోషికి విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించాలని ఆదేశాలు జారీచేయవచ్చని అన్నారు. ప్రస్తుతం రఘునందన్‌కు శిక్ష అమలు విషయమై పెన్సిల్వేనియా టాస్క్ ఫోర్స్, సలహా కమిటీల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజా ఘటనతో అమెరికాలో మరణదండన ఎదుర్కొంటున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా రఘునందన్ నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘునందన్ హెచ్1బీ వీసాతో అమెరికాకు వెళ్లాడు. శాన్వీతో పాటు ఆమె నాయనమ్మను హత్యచేసిన ఇతను విచారణ సందర్భంగా తన లాయర్లు హిల్లెస్, హెక్మన్ల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశాడు. ఫోన్లు చేసినప్పటికీ, లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదన్నాడు. మళ్లీ విచారణ కోరడానికి బదులుగా తనకు విధించిన మరణశిక్షను వెంటనే అమలు చేయాలని పలుమార్లు కోర్టు హాల్లోనే డిమాండ్ చేశాడు. -
దారుణ హత్య
కట్టెల వ్యాపారిని హతమార్చిన దుండగులు పదునైన ఆయుధాలతో దాడి తాడూరు మండలం కుమ్మెరలో ఘటన తాడూరు: గుర్తుతెలియన దుండగుల చేతిలో ఓ కట్టెల వ్యాపారి దారుణహత్యకు గురైన సంఘటన తాడూరు మండలం కుమ్మెరలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుమ్మెర గ్రామానికి చెందిన మేకల కృష్ణయ్య (45)కట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం 10.30గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటినుంచి బయల్దేరి వెళ్లిన ఆయన గురువారం ఉదయం కుమ్మెరలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పశువుల ఆస్పత్రి పరిసరాల్లో శవమై కనిపించాడు. ఉదయం ఆయా గ్రామాల నుంచి కుమ్మెర పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కృష్ణయ్య మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని స్థానిక సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ గూళ్ల చెన్నయ్య, గ్రామస్తులకు తెలిపారు. దీంతో సర్పంచ్ పోలీసులకు విషయం చెప్పడంతో ఎస్ఐ వి.పురుషోత్తం తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి వచ్చి హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. హతుడి ఎడమ చేయి వెనక, తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేయడంతో బలమైన గాయాలు కనిపించాయి. కొద్దిదూరంలో ఉన్న రక్తపు మడుగు నుంచి మృతదేహాన్ని లాక్కెళ్లి ప్రహరీ గోడ మూలన పడేసినట్లు సంఘటనను బట్టి తెలుస్తోందని ఎస్ఐ పేర్కొన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని, గ్రామస్తులు, సంబంధిత వ్యక్తులతో విచారించి దర్యాప్తు సాగిస్తామని ఆయన పేర్కొన్నాడు. మృతుడు కృష్ణయ్యకు భార్య బాలమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు.