మైనర్‌కు పెళ్లి
సదాశివనగర్, న్యూస్‌లైన్: సదాశివనగర్ మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహం జరిగింది. మండల కేంద్రానికి చెందిన మర్కంటి రణిత(16)ను దోమకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన రాజుకు ఇచ్చి శుక్రవారం పెళ్లి చేశారు. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న ఇరు కు టుంబాల వారు అధికారులు వచ్చేలోపు వివాహం జరిపించారు. దీంతో అధికారు లు బాల్య వివాహాన్ని అడ్డుకోలేక పోయారు.
అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే రణితను అత్తారింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రుల చేత అధికారులు రాతపూర్వకంగా రాయించుకున్నారు. అంతేకాకుండా రణిత తల్లిదండ్రులు బీరయ్య, తల్లి మల్లవ్వ, రాజు తల్లిదండ్రులు నర్సింహులు, మల్లవ్వకు కౌన్సెలింగ్ నిర్వహిం చా రు. వివాహ వయస్సు రాకముందు పెళ్లిలు చేస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు, బా ల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యల గురించి వివరించారు. కార్యక్రంలో ఐసీడీఎస్ సీడీపీవో శశికళ, తహశీల్దార్ శరత్‌కుమార్, ఎస్సై నవీన్‌కుమార్, ఆర్ఐ కిష్టయ్య, వీఆర్వో శంకర్రాజు, అంగన్వాడీ కార్యకర్త గంగమణి పాల్గొన్నారు.