market values
-
ప్రజలపై భారం.. రూ.13,500 కోట్లు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. స్థిరాస్థుల మార్కెట్ విలువలను భారీగా పెంచడం ద్వారా ప్రజల నడ్డివిరుస్తోంది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, నివాస భవనాలను వేటినీ వదలకుండా వాటి విలువల్ని అమాంతం పెంచేసింది. అర్బన్ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇష్టానుసారం సవరించింది.రాష్ట్రవ్యాప్తంగా ఈ పెరుగుదల 50 శాతానికి పైగానే ఉండగా కొన్ని ప్రాంతాల్లో 80 శాతానికి దగ్గరగా ఉంది. ఇక శనివారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పెరుగుదల అమల్లోకి వచ్చింది. షాక్ కొట్టేలా పెరిగిన కొత్త మార్కెట్ విలువల ప్రకారమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో జనం లబోదిబోమంటున్నారు. భూముల విలువలే కాకుండా నిర్మాణాల విలువలను (స్ట్రక్చర్ రేట్లు) కూడా పెంచిపారేశారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, రేకుల షెడ్లు, పూరిళ్లు, ఖాళీ స్థలాల విలువల్ని పెంచడంతో ప్రజలపై ఇంకా భారం పెరిగిపోయింది.రాయలసీమ ప్రాంతంలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పెరుగుదలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు జనం వెనుకాడుతున్నారు. ఇందుకు ఉదాహరణే.. శుక్రవారం వరకూ కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శనివారం వెలవెలబోయాయి. పెనుకొండలో భారీగా..సత్యసాయి జిల్లా పెనుకొండలో అత్యధికంగా మార్కెట్ విలువల్ని 78 శాతం పెంచారు. మడకశిర ప్రాంతంలో 69 శాతం పెంచారు. గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో 73 శాతం పెరుగుదల ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డోర్ నెంబర్ల వారీగా అక్కడి విలువల్ని నిర్థారించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయనే నెపంతో కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా రేట్లు పెంచారు. అలాగే, కొత్తగా ఏర్పడిన వాణిజ్య స్థలాల డోర్ నెంబర్లను సేకరించి వాటిపై భారం మోపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములతోపాటు కొత్తగా వ్యయసాయేతర భూములుగా మారిన వాటి వివరాలు సేకరించి వాటి రేట్లూ పెంచారు.జాతీయ రహదారులు, ప్రధాన రహదారులే కాకుండా ఓ మోస్తరు రహదారుల వెంట, వాటి చుట్టుపక్కల ప్రాంతాల భూముల విలువలను పెంచారు. ఇందుకోసం ఎన్నడూ లేనివిధంగా భూముల క్లాసిఫికేషన్లు కూడా మార్చారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు అవసరమైతే నాలుగు రేట్లు నిర్థారించారు. వ్యవసాయ భూముల్లో మెట్ట, మాగాణి కాకుండా వాటిలోనూ రెండు, మూడు రేట్లు పెట్టారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా నివాస, వాణిజ్య ప్రాంతాల్లోనూ వీలును బట్టి రెండు, మూడు రేట్లు పెట్టారు. బండి ఆత్మకూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, దువ్వూరు, అవుకు తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల 50 నుంచి 60 శాతానికి పైగా ఉంది. వెంకటగిరి, నందికొట్కూరు, ప్యాపిలి, హిందూపురం, గజపతినగరం, మంగళగిరి, తెనాలి, బాపట్ల, జమ్మలమడుగు, చంద్రగిరి, గూడూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పెంచారు.గజానికి రూ.5 వేలు పెరిగింది.. ⇒ ఇదిలా ఉంటే.. విజయవాడలోని వాణిజ్య ప్రాంతమైన బీసెంట్ రోడ్డు ఏరియాలో గజం విలువను రూ.5 వేలు పెంచారు. గతంలో రూ.1.10 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.1.15 లక్షలకు పెరిగింది. ⇒ గవర్నర్‌పేట ప్రాంతంలోనూ గజం 1.09 లక్షల నుంచి 1.15 లక్షలకు పెరిగింది. ⇒ గాందీనగర్‌లో రూ.58 వేల నుంచి రూ.64 వేలకు పెంచారు. ⇒ గురునానక్ నగర్ కాలనీలో గజానికి రూ.3 వేలు పెంచారు. ⇒ విశాఖపట్నంలోని దేశివానిపాలెంలో గజం రూ.1.19 లక్షల నుంచి నుంచి రూ.1.26 లక్షలకు పెరిగింది. జగదాంబ సెంటర్, వన్‌టౌన్, డాబా గార్డెన్స్, ఎంవీపీ కాలనీ వంటి చోట్లా గజానికి రూ.5 వేలకు పైనే పెరిగింది. ⇒తిరుపతి జిల్లాలోని రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లోనూ గజానికి రూ.2 నుంచి రూ.3 వేలకు పెంచారు. ⇒ కొన్నిచోట్ల 50 శాతం పెరుగుదలతో రూ.30 లక్షలున్న ఆస్థి విలువ రూ.45 లక్షలకు పెరిగింది. దీంతో గతంలో దీనిపై రూ.2.30 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు రూ.3.5 లక్షల వరకు కట్టాల్సి వస్తోంది. అంటే అదనంగా 1.20 లక్షల భారం పడుతోంది. రూ.13,500 కోట్ల ఆదాయమే లక్ష్యం.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రజల నడ్డివిరిచి ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా మార్కెట్ విలువల్ని చంద్రబాబు ప్రభుత్వం సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,500 కోట్ల ఆదాయాన్ని సాధించే లక్ష్యంతో ఈ పెరుగుదలను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం జనవరి నెలాఖరుకు రూ.10,800 కోట్ల ఆదాయం సమకూరాలి. కానీ, రూ.7,500 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచి్చంది. జనవరి వరకే రూ.3,300 కోట్ల లోటు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రాబోయే రోజుల్లోనూ ఆదాయం పెరిగే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు భారీగా మార్కెట్ విలువల్ని పెంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే ప్రజలు ఈ రేట్లు చూసి షాక్‌కు గురవుతున్నారు. -
30వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు!
ఉప్పు నుంచి ఉక్కు దాకా... సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ అగ్రగామిగా... దేశ ప్రజల తలలో నాలుకగా మారిన టాటా గ్రూప్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశ కార్పొరేట్ జగత్తులో అత్యంత విలువైన ‘రతనం’లా వెలిగిపోతోంది. అలుపెరుగని ఈ పయనంలో టాటా బ్రాండ్‌కు ఖండాంతర ఖ్యాతిని తెచి్చన ఘనత కార్పొరేట్ ‘టైటాన్’ రతన్ టాటా సొంతం! లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ తమ వ్యాపార ఫలాలను పంచిన వితరణ శీలిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్‌ను మహాసామ్రాజ్యంగా విస్తరించారు. ఇటు ప్రధానమైన వ్యాపార విభాగాలను పటిష్టం చేస్తూనే అటు పేరొందిన విదేశీ దిగ్గజ కంపెనీలను కూడా కొనేసి భారతీయ కార్పొరేట్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. మిగతా దేశీ కార్పొరేట్లకు స్ఫూర్తినిచ్చారు. విమర్శలు, హేళనలు ఎదురైనా వాటిన్నింటినీ అధిగమించి టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజంగా మల్చారు. రతన్ పగ్గాలు చేపట్టేనాటికి గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు మాత్రమే. ఇక ఆదాయం 6 బిలియన్ డాలర్ల (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం రూ.18,000 కోట్లు) స్థాయిలో నిదానంగా పురోగమిస్తున్న టాటా గ్రూప్ ఆయన సాహసోపేత నిర్ణయాలు, దూకుడు దన్నుతో నేడు ఏకంగా 165 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) ఆదాయాల స్థాయికి విస్తరించింది. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు ఆయా రంగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గ్రూప్‌లో పది విభాగాల్లో ప్రధానంగా 30 కంపెనీలు ఉండగా వీటిలో 26 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వీటికి అనుబంధంగా పలు సంస్థలు కూడా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి వాటి టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 365 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.30 లక్షల కోట్లు) అధిగమించడం విశేషం. టాటా సామ్రాజ్యంలోని సంస్థలు ఆరు ఖండాల్లో 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 6 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు.. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా వ్యవహరించారు. వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 95 కంపెనీలు గ్రూప్‌లో ఉండేవి. కెమికల్స్, హోటల్స్, ఉప్పు, ఉక్కు, సబ్బులు, వాచీలు మొదలైన విభాగాల్లో ఇవన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, ఒకదానితో మరొకదానికి పెద్దగా సంబంధం లేని విధంగా ఉండేవి. రతన్ టాటా వచ్చాక వాటన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ అనుబంధ సంస్థలన్నింటికి కూడా ఒకే కార్పొరేట్ గుర్తింపు ఉండాలని నిర్దేశించారు. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, నిదానంగా నడుస్తున్న గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయి విస్తరించారు. ఐఐఎం బెంగళూరు పరిశోధన పత్రం ప్రకారం ఆయన హయాంలో గ్రూప్ ఆదాయాలు 6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 18,000 కోట్ల నుంచి రూ. 5.5 లక్షల కోట్లకు) ఎగిశాయి. గ్రూప్ మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల నుంచి 91.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 30,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు) పెరిగింది. కీలక కొనుగోళ్లు.. కోరస్: ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను 2007లో టాటా స్టీల్ ఏకంగా 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. ఒక విదేశీ కంపెనీని ఇంత భారీ మొత్తం వెచి్చంచి కొనుగోలు చేయడం అప్పటిదాకా కనీవినీ ఎరుగనిది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్ ఒక్కసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు దిగ్గజాల జాబితాలోకి చేరిపోయింది. గ్రూప్ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. అప్పటిదాకా ఎక్కువగా దేశీ మార్కెట్‌పైనే దృష్టి పెట్టిన టాటా స్టీల్, కోరస్ కొనుగోలుతో యూరప్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్: రతన్ టాటా 2008లో మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఈసారి దిగ్గజ బ్రిటీష్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్రోవర్పై గురి పెట్టారు. 2.3 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ తర్వాత అదొక మాస్టర్‌స్ట్రోక్ అని రతన్ టాటా నిరూపించారు.గ్లోబలైజేషన్ బాటలో గ్రూప్.. ప్రధానంగా భారత్‌పై దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్‌ను గ్లోబల్ ప్లేయర్‌గా రతన్ టాటా తీర్చిదిద్దారు. ఇందుకోసం దూకుడుగా విదేశీ కంపెనీలను కొన్నారు. 2008లో బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లో టాటా మోటార్స్‌ను ప్రముఖ సంస్థగా నిలిపారు. అంతకన్నా ముందుగా 2000లో టెట్లీని కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ టీ మార్కెట్లో టాటా గ్రూప్ కూడా ప్రధాన ప్లేయర్‌గా ఎదిగింది.టీసీఎస్.. ఐటీ కోహినూర్!టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్) పాత్ర చాలా కీలకం. 1968లోనే ఏర్పడినప్పటికీ రతన్ టాటా సారథ్యంలో టీసీఎస్కి రెక్కలొచ్చాయి. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచి్చంది. ఏకంగా రూ. 4,713 కోట్లు సమీకరించింది. అప్పటి నుండి అద్భుతమైన పనితీరుతో టీసీఎస్ దూసుకెళ్తోంది. టీసీఎస్‌తో పాటు టాటా మోటర్స్, టాటా స్టీల్, టాటా పవర్ దన్నుతో గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్లకు ఎగిసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరల పెంపుతో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు విలువలు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. తద్వారా ప్రజలపై భారం పడుతుండగా.. రిజిస్ట్రేషన్ శాఖకు కాసులపంట పండనుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉన్న పట్టణాలు, పల్లెల్లో మార్కెట్ ధరలు పెంచుతున్నారు. గత జూలైలోనే పెంచగా.. ఇప్పుడు మళ్ళీ వాటికి వ్యవసాయ భూముల్లో సుమారుగా 50 శాతం వరకు, ప్లాట్లు, అపార్ట్మెంట్లలో 35 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల వారీగా మార్కెట్ ధరను పెంచగా కమిటీల సంతకాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. 5 నెలల్లోనే మరోసారి పెంపు... భూముల విలువ ప్రకారం భూ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా సుమారు తొమ్మిదేళ్ల కిత్రం పెంచగా గత జూలైలో మార్కెట్ విలువను సవరించారు. తొమ్మిదేళ్ల నుండి పెంచలేదు కాబట్టి పెంచారని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పాత విలువలను బట్టే ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంచుకోవడం కోసం ఎనిమిదేళ్ల తర్వాత గత జూలైలో పెంచింది. ఏడాది కూడా కాకుండానే పెంచిన ధరలను మళ్లీ 6 నెలలకే పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి 50 శాతం వ్యవసాయ భూములు.. 35 శాతం ప్లాట్లు కొత్తగా ప్రభుత్వం మార్కెట్ ధరను పెంచాలని తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయభూములు సుమారు 50 శాతం వరకు పెరగనున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా సైదాపూర్‌లో 2.25 లక్షల నుండి 3.37 లక్షలు పెరుగుతుండగా జమ్మికుంటలోని వ్యవసాయ భూములు మార్కెట్ విలువ ఎకరానికి 2.22 కోట్ల నుండి 3.33 కోట్ల వరకు పెరుగుతోంది. కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములు సైతం ఇదే స్థాయిలో పెరగనున్నట్లు సమాచారం. కరీంనగర్లో గరిష్టంగా గజానికి 32,500 ఉండగా ఇప్పుడు దానిని 37,400 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగుకు 2,200 ఉండగా ఇప్పుడు ఆ విలువను 3,300లకు పెంచనున్నారు. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) వేములవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లో కూడా పెంచారు. కరీంనగర్‌లోని ప్రధాన పట్టణాలైన జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, గంగాధరల్లో మార్కెట్ వ్యాల్యూ పెరుగుతున్నాయి. దీనివల్ల సుమారు 20 కోట్ల పైగానే రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రజల నెత్తిన మాత్రం భారం పడనుంది. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? మరికొంత సమయమివ్వాలి... ప్రభుత్వం ఫిబ్రవరి 1 తేదీ నుండి కొత్త ధరలు అమల్లోకి తీసుకువస్తుందని తెలియడంతో కరీంనగర్‌తోపాటు 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వారం రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలతోపాటు రామగుండం, హుజూరా బాద్, కోరుట్ల, మెట్పల్లి వంటి పట్టణ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మీసేవా, రిజిస్ట్రేషన్ సర్వర్లు బిజీ వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల గడువు ఇచ్చిన తర్వాత పెంచిన మార్కెట్ విలువను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇకపై భూ భారం
ఇక స్థలాల రిజిస్ట్రేషన్లూ భారమే మార్కెట్ విలువ పెంపుతో అవస్థలు ఇరవై నుంచి నూరు శాతం వరకూ పెంపు ఒంగోలు సబర్బన్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలపై ప్రతి ఏడాదికి రూ.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు రెట్టింపు ఆదాయం సమకూరనుంది. గతంలో ఉన్న మార్కెట్ విలువలకంటే కొన్ని ప్రాంతాల్లో నూరు శాతం పెరగగా మరికొన్ని చోట్ల 50 శాతం పెరగనున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న సమయంలో భూముల విలువలు విపరీతంగా దళారులు పెంచిన విషయం తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా ఈ వ్యాపారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా తయారైంది. చివరకు అప్పుల్లోళ్ళకు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఐపీలు కూడా పెట్టారు. ఈ పరిస్థితుల్లో స్థలాల, భూములు, నిర్మాణాల మార్కెట్ విలువలు పెంచటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయ లక్ష్యం రూ.18.10 కోట్లుంటే ప్రస్తుతం పెంచిన ధరలతో ఒకేసారి రూ.38 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.