ఐబీపీఎస్ నోటిఫికేషన్-2015
స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం ఐబీపీఎస్- 2015 నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
ఉద్యోగాలు-విద్యార్హతలు: ఐటీ ఆఫీసర్: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ/పీజీ/డీఓఈఏసీసీలో బీ లెవల్ గ్రాడ్యుయేషన్.
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ హజ్బెండరీ/వెటర్నరీ సైన్స్/డెయిరీ సైన్స్/ అగ్రి ఇంజనీరింగ్/ఫిషరీ సైన్స్/పిసి కల్చర్/ అగ్రి మార్కెటింగ్ అండ్ కోపరేషన్/కోపరేషన్ అండ్ బ్యాంకింగ్/ఆగ్రో ఫారెస్ట్రీలో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్.
రాజ్‌భాషా అధికారి: హిందీలో పీజీ (ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా) లేదా సంస్కృతంలో పీజీ (హిందీ, ఇంగ్లిష్‌లు సబ్జెక్టులుగా ).
లా ఆఫీసర్: ఎల్ఎల్బీ (బార్ కౌన్సిల్లో నమోదై ఉండాలి).
హెచ్ఆర్ / పర్సనల్ ఆఫీసర్: పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్ఆర్/ హెచ్ఆర్డీ/సోషల్ వర్క్/లేబర్ లాలో పీజీ /పీజీ డిప్లొమా
మార్కెటింగ్ ఆఫీసర్: ఎంబీఏ (మార్కెటింగ్)/ రెండేళ్ల పీజీ డీబీఏ/పీజీడీబీఎం (మార్కెటింగ్ స్పెషలైజేషన్).
వయో పరిమితి: 01-11-24 నాటికి 20-30 ఏళ్లు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
రాత పరీక్ష స్వరూపం: మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమయం రెండు గంటలు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. ఉద్యోగాలను బట్టి రాత పరీక్ష వేర్వేరుగా ఉంటుంది.
లా ఆఫీసర్ / రాజ్‌భాషా అధికారి ఉద్యోగాలకు రాత పరీక్ష విధానం
అంశం మార్కులు
రీజనింగ్ 50
ఇంగ్లిష్ 25
జనరల్ అవేర్నెస్ 50
{పొఫెషనల్ నాలెడ్జ్ 75
మొత్తం మార్కులు 200
ఐటీ ఆఫీసర్ / అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్/ హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్/ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్ష విధానం
అంశం మార్కులు
రీజనింగ్ 50
ఇంగ్లిష్ 25
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
{పొఫెషనల్ నాలెడ్జ్ 75
మొత్తం 200
నోటిఫికేషన్ సమాచారం:
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 9-12-2014
హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 3-2-2015
రాత పరీక్ష: 14-2-2015, 15-2-2015
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం.
వెబ్సైట్: www.ibps.in
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఉద్యోగాలు
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సన్నద్ధమైంది. వివరాలు...
ఖాళీలు: 684
(ఆంధ్రప్రదేశ్‌కు 39 పోస్టులు, తెలంగాణకు 26 పోస్టులు కేటాయించారు).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/హెచ్ఎస్సీ/ ఇంటర్మీడియెట్
వయసు: 30-06-2014 నాటికి 18-28 ఏళ్లు.
ఎంపిక: మూడు దశలు.. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష: 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మార్కులు 250. ఈ 250 మార్కులను గరిష్టంగా 35 మార్కులకు కుదిస్తారు. సమయం రెండు గంటలు. ఇంటర్వ్యూకు 15 మార్కులు ఉంటాయి. వివరాలు..
అంశం మార్కులు ప్రశ్నల
సంఖ్య
రీజనింగ్ 50 40
ఇంగ్లిష్ 50 40
న్యూమరికల్ ఎబిలిటీ 50 40
జనరల్ నాలెడ్జ్ 50 40
కంప్యూటర్ నాలెడ్జ్ 50 40
మొత్తం 250 200
ముఖ్య సమాచారం
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 2-12-2014
పరీక్ష ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 75, మిగిలిన వారికి రూ.450
రాతపరీక్ష: 2015 జనవరి మొదటి వారంలో ఉంటుంది.
వెబ్సైట్: www.uiic.co.in
ఎంబీబీఎస్ కాకుండా ఎయిమ్స్ అందిస్తున్న ఇతర కోర్సుల వివరాలు తెలపగలరు?
- శంకర్, మహబూబ్‌నగర్.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిల్లీ, ఎంబీబీఎస్ కాకుండా బ్యాచిలర్ స్థాయిలో నర్సింగ్, మెడికల్ టెక్నాలజీ, ఆఫ్తాల్మిక్ టెక్నిక్‌లలో బీఎస్సీ కోర్సులను అందిస్తోంది. అర్హత: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2ను కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును కూడా ఎయిమ్స్ ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్సైట్:www.aiims.edu
సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు?
- చరణ్, గద్వాల్.
సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. అభ్యర్థి వయసు 25 ఏళ్లకు మించకూడదు. పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. అవి..
టైర్ 1: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). ఇందులో జనరల్ ఇంటలిజెన్స్ + రీజనింగ్ (50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (50 మార్కులు) విభాగాలు ఉంటాయి.
టైర్ 2: మెయిన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ (100 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్
(200 మార్కులు) విభాగాలు ఉంటాయి.
టైర్ 3: పర్సనాలిటీ టెస్ట్. టైర్-1, 2 దశల్లో అర్హత సాధించిన వారికి టైర్-3లో ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పోస్ట్ ఖరారు చేస్తారు.
వెబ్సైట్: ssc.nic.in
క్లాట్ పరీక్ష వివరాలను తెలపండి?
ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- ప్రవీణ్, నల్లగొండ.
స్టాటిస్టిక్స్.. న్యూమరికల్ డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు సంబంధించినది. దీని అనువర్తనాలను ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మెడిసిన్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ తదితర విభాగాల్లో ఉపయోగిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా..
స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అడ్వాన్స్డ్ ప్రాబబిలిటీ, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ తదితర స్పెషలైజేషన్లతో కోర్సు అందుబాటులో ఉంది. అకడమిక్ రికార్డ్‌తో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్సైట్: www.isical.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్.
వెబ్సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం.
వెబ్సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. స్టాటిస్టిక్స్; అప్లైడ్ స్టాటిస్టిక్స్; స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఏ లేదా బీఎస్సీ.
వెబ్సైట్: svuniversity.ac.in
కెరీర్: స్టాటిస్టిక్స్‌లో పీజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తదితర అవకాశాలను అందుకోవచ్చు. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, మార్కెట్ రీసెర్చ్ కన్సల్టెన్సీలు, మార్కెటింగ్-ఆర్ అండ్ డీ విభాగాలు, విద్యాసంస్థల్లో ఉన్నత అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
క్లాట్ పరీక్ష వివరాలను తెలపండి? -శరణ్య, కోదాడ.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) పరీక్ష ద్వారా 14 నేషనల్ లా యూనివర్సిటీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
ఎల్ఎల్బీ:
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో 10+2/
తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
రాత పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్ (40 మార్కులు); జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్(50 మార్కులు); ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ-20 మార్కులు); లీగల్ ఆప్ట్టిట్యూడ్ (50 మార్కులు); లాజికల్ రీజనింగ్ (40 మార్కులు).
ఎల్ఎల్ఎం:
అర్హత: 55 శాతం మార్కులతో ఎల్ఎల్బీ/ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ/తత్సమానం.
రాత పరీక్ష విధానం: పరీక్ష డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్‌ల కలయికగా ఉంటుంది. డిస్క్రిప్టివ్ విభాగంలో నాలుగు ఎస్సే ప్రశ్నలు ఉంటాయి. వీటికి 25 చొప్పున కేటాయించిన 100 మార్కులు. ఆబ్జెక్టివ్ విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కేటాయించిన మార్కులు 50. సమయం: 2 గంటలు.
వివరాలకు: www.clat.ac.in
ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షకు లైవ్ మోడల్ టెస్ట్స్
హైదరాబాద్: డిసెంబరు 06, 07, 13, 14, 20, 21, 27 తేదీల్లో ఐబీపీఎస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్కు పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సాక్షి నవంబరు 29, 30న నిపుణులతో రూపొందించిన ఆన్లైన్ లైవ్ మోడల్ టెస్టులను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. సమయం 120 నిమిషాలు. క్లర్కు పరీక్షకు సాక్షి సమగ్ర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించడంతో పాటు సాధనలు, వివరణలతో కూడిన 3 ప్రాక్టీస్ టెస్టులు, సబ్జెక్టుల వారీగా 7000+ మాదిరి ప్రశ్నలు కూడా అందుబాటులో ఉంచింది.
లైవ్ టెస్ట్స్ ప్రత్యేకతలు:
లైవ్ టెస్ట్ తేదీలు: నవంబర్ 29, 30
అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలు
అభ్యర్థికి రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్
అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులు
పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
వెబ్సైట్:
http://onlinetests.sakshieducation.com
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్వర్క్