Markets and News
-
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది. -
New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్.. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో మళ్లీ పసిడి మెరుస్తోంది. ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం కీలకమైన 1,900 డాలర్లు దాటింది. ఒకదశలో 1,913 డాలర్లకుపైగా ఎగసింది. గడచిన 20 వారాల్లో పసిడి కీలక నిరోధం 1,900 డాలర్లను అధిగమించడం ఇదే తొలిసారి. 1,913 డాలర్ల నిరోధాన్ని అధిగమించి, స్థిరపడితే తిరిగి గరిష్టాల దిశగా బంగారం దూసుకుపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. కారణం ఏంటి..: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు తలెత్తాయి. అయినప్పటికీ సరళతర ఆర్థిక విధానాలకే (ప్రస్తుత ఫెడ్ ఫండ్‌రేటు 0.00 శాతం–0.25 శాతం) కట్టుబడి ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ అధికారులు స్పష్టం చేశారు. దీనితో ఆరు దేశాల కరెన్సీల ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93 గరిష్ట స్థాయిల నుంచి తాజాగా 89.80 కనిష్టానికి (4 నెలల కనిష్టం) పడిపోయింది. ఇది పసిడి ధర పెరుగుదలకు దారితీసింది. సరళతర ఆర్థిక పరిస్థితులు ఒకవైపు, ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి మరోవైపు నేపథ్యంలో తిరిగి ఇన్వెస్టర్ పసిడిని తన పెట్టుబడులకు తక్షణ రక్షణ కవచంగా ఎంచుకున్నట్లు విశ్లేషణ. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,673 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,107 డాలర్లు. దేశీయంగా చూస్తే...: అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. 1,640 డాలర్ల స్థాయికి పడిపోయినప్పుడు కొంచెం అటుఇటుగా రూ.45,000 వద్దకు చేరింది. బుధవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర దాదాపు రూ.200 లాభంతో రూ.49,000 పైకి ఎగసింది. దేశీయ ధరపై అంతర్జాతీయ ఎఫెక్ట్ అంతర్జాతీయంగా ధరల పెరుగుదల దేశీయ యల్లో మెటల్‌పై ప్రభావం చూపుతోంది. దీనితో దేశంలో ధర 4 నెలల కనిష్టానికి చేరింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పడిపోవడం, డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఫెడ్ భయాలు, దీనికితోడు భారత్‌సహా పలు దేశాల్లో కరోనా సెకండ్‌వేవ్ సవాళ్లు పసిడి ధర పెరుగుదలకు దారితీశాయి. –నిష్ భట్, సీఈఓ, మిల్ఉడ్ కేన్ ఇంటర్నేషనల్ చదవండి: స్విగ్గీ.. జొమాటోకు షాక్.! -
app కీ కహానీ...
ఫారెక్స్ క్యాలెండర్ మీరు ఫారెక్స్ ట్రేడరా? అయితే ‘ఫారెక్స్ క్యాలెండర్, మార్కెట్ అండ్ న్యూస్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్ ద్వారా మీరు ఫారెక్స్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారం, వివరాలు, విశ్లేషణలు వంటి తదితర చాలా అంశాలను తెలుసుకోవచ్చు. యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ► యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ► మీ ఫారెక్స్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ► యాప్‌లో పోర్ట్‌ఫోలియో, ఎకనమిక్ క్యాలెండర్, ఫారెక్స్ మార్కెట్స్, ఫారెక్స్ చార్ట్స్, ఫారెక్స్ న్యూస్, కమ్యూనిటీ ఔట్లుక్ వంటి తదితర ఆప్షన్స్ ఉంటాయి. ► పోర్ట్‌ఫోలియో ఆప్షన్‌లోకి వెళితే మీరు మీ మైఎఫ్ఎక్స్బుక్ సంబంధిత పోర్ట్‌ఫోలియో వివరాలను చూసుకోవచ్చు. ►ఇక మార్కెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా దాదాపు 60 ఫారెక్స్ కరెన్సీ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ►ఇండికేటర్స్, టెక్నికల్ విశ్లేషణతో కూడిన లైవ్ ఫారెక్స్ చార్ట్స్ అయితే ఫారెక్స్ చార్ట్స్ ఆప్షన్లో అందుబాటులో ఉంటాయి. ►ఫారెక్స్ న్యూస్ ఆప్షన్లో ఆర్థిక సంబంధిత వార్తలను తెలుసుకోవచ్చు. ► ట్రేడ్స్‌ను ప్లాన్ చేసుకోవడానికి అనువుగా ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ►యాప్‌లో టాప్ ఫారెక్స్ బ్రోకర్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి.