markets close in red
-
మరింత ప్రమాదకరంగా 2024..?
స్టాక్మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు లాభాల్లోకి వెళ్లక దాదాపు సంవత్సరం దాటింది. ఇటీవల మార్కెట్ కాస్త పుంజుకుని ఆల్‌టైమ్‌హైని చేరింది. దాంతో రానున్న ఏడాదిలో లాభాలు వస్తాయేమోననే ఆశలు చిగురించాయి. దానికితోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో 2024 కొంత ఆశాజనకంగా ఉంటుందనే వాదనలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా రానున్న ఏడాదిసైతం నష్టాల తిప్పలు తప్పవని, గతంలో కంటే మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన మార్కెట్ క్రాష్ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మకూడదని కోరారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలుతాయని జోష్యం చెప్పారు. అయితే ఈసారి వచ్చే మార్కెట్ క్రాష్ 1929-1932లో వచ్చిన మాంధ్యం తీవ్రతతో సమానంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో ఎస్ అండ్ పీ500లో 86%, నాస్డాక్లో 92%, క్రిప్టో మార్కెట్ 96% కుప్పకూలే ప్రమాదం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని తెలిపారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశమని సలహా ఇచ్చారు. ఇదీ చదవండి: ‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వచ్చే ఏడాది కీలక వడ్డీరేట్లను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇటీవల జరిగిన సమావేశాల ఆధారంగా తెలుస్తోంది. అయితే ఇలా రేట్ల తగ్గిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే చర్యలను మానుకోవాలని డెంట్ అన్నారు. దీని కారణంగా తేలికపాటి మాంధ్యం అంచనాలకు విరుద్ధంగా.. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికమాంధ్యానికి దారితీస్తుందన్నారు. ఈ ఆర్థికవేత్త 1989లో జపాన్‌లో జరిగిన ‘బబుల్ బర్స్ట్’, అమెరికా డాట్-కామ్ బబుల్, డోనాల్డ్ ట్రంప్ విజయం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఆర్థిక వ్యూహకర్తలు, గోల్డ్‌మన్ సాక్స్ వంటి పెట్టుబడి సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లపై బుల్లిష్‌గానే ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
ఫెడ్ రేట్ల భయం.. నష్టాల్లో మార్కెట్లు
అమెరికాలో వడ్డీరేట్లు పెంచుతారన్న భయం... భారతీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. మధ్యాహ్నం తర్వాత వచ్చిన ఈ వార్తతో ఒక సమయంలో సెన్సెక్స్ 179 పాయింట్లు పడిపోయింది. యూఎస్ ఫెడ్ ఏం నిర్ణయం వెలువరిస్తుందోనని ఇన్వెస్టర్లు అంతా చాలా ఆందోళనగా ఎదురుచూశారు. అనుకున్న దానికంటే ద్రవ్యోల్బణం తగ్గినా, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశాభావం ఉన్నా కూడా అది మార్కెట్లకు పెద్దగా పనికిరాలేదు. చివరకు మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 25,705.93 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 7,829.10 వద్ద ముగిశాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 27,811.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,382 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీక్ సంక్షోభ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై గట్టిగానే కనపడుతోంది. బ్యాంకు షేర్లు పడిపోవడంతో సెన్సెక్స్ నష్టాల్లోనే ముగిసింది. ఈ వారంలో మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం మిడ్ సెషన్ నుంచి మార్కెట్లు పడిపోవడం కనిపించింది. మిడ్ సెషన్లోనే సెన్సెక్స్ 80 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా మధ్యాహ్నం సెషన్లో 17.50 పాయింట్లు పడిపోయింది. 27,880.72 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. చివరకు 84.13 పాయింట్లు నష్టపోయి 27811.84 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు నష్టపోయి, 8,382 వద్ద ముగిసింది. రూ. 48 వేల కోట్లతో దేశంలో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామన్న ప్రధాని ప్రకటనతో మార్కెట్ల ప్రారంభ సమయంలో కొంత పాజిటివ్ లక్షణాలు కనిపించినా.. గ్రీక్ సంక్షోభం దాన్ని అధిగమించి మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. ఐటీ, వినియోగదారుల వస్తువులు, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఆరోగ్య రంగాల షేర్లు కొంత లాభాలు పొందాయి. అయితే బ్యాంకులు, కేపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్, గ్యాస్, విద్యుత్ రంగ షేర్లు మాత్రం బాగా ఒత్తిడికి గురయ్యాయి.