ఫెడ్ రేట్ల భయం.. నష్టాల్లో మార్కెట్లు
అమెరికాలో వడ్డీరేట్లు పెంచుతారన్న భయం... భారతీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. మధ్యాహ్నం తర్వాత వచ్చిన ఈ వార్తతో ఒక సమయంలో సెన్సెక్స్ 179 పాయింట్లు పడిపోయింది. యూఎస్ ఫెడ్ ఏం నిర్ణయం వెలువరిస్తుందోనని ఇన్వెస్టర్లు అంతా చాలా ఆందోళనగా ఎదురుచూశారు.
అనుకున్న దానికంటే ద్రవ్యోల్బణం తగ్గినా, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశాభావం ఉన్నా కూడా అది మార్కెట్లకు పెద్దగా పనికిరాలేదు. చివరకు మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 25,705.93 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 7,829.10 వద్ద ముగిశాయి.