సంప్రదాయ సరిగమలు
కుత్బుల్లాపూర్: దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ట్రెడిషనల్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో ర్యాంప్ వాక్ చేసి అదరహో అనిపించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.