‘మన ఊరు.. మన ప్రణాళిక’ లోఉద్రిక్తం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన కాసేపటికి హాల్లోకి వచ్చిన కప్పాడు ఎంపీటీసీ సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి హల్చల్ చేశారు. ఎంపీపీ డోకూరి వెంకట్రామ్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం, పోడియం వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీకి చెందిన నిరంజన్‌రెడ్డి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమై అనూహ్యంగా పోచారం ఎంపీటీసీ వెంకట్రామ్రెడ్డి ఎంపీపీగా లాటరీ విధానంతో ఎన్నికైన విషయం తెలిసిందే. తన వద్ద డబ్బులు తీసుకుని.. తనకు దక్కాల్సిన పదవిని వెంకట్రామ్రెడ్డి ఎగరేసుకుపోయారని నిరంజన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీపీగా ఎన్నికైన తర్వాత వెంకట్రామ్‌రెడ్డితో పాటు ఆయా గ్రామా ల ఎంపీటీసీలు తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో నిరంజన్‌రెడ్డి వచ్చీరావడంతోనే వెంకట్రామ్‌రెడ్డిపై తిట్ల దండకం మొదలుపెట్టాడు.
వెంకట్రామ్రెడ్డి తనకు ఓటేస్తానని మాటిచ్చి చివరికి తనపైనే పోటీ చేశాడని, పదవి చేపట్టాలని తుది వరకూ వ్యయప్రయాసలకోర్చిన తన పొట్టపై కొట్టి అడ్డదారిలో పదవి చేపట్టారన్నారు. నిరంజన్‌రెడ్డి సభకు అంతరాయం కలిగి స్తున్నారని తెలుసుకున్న పోలీసులు అతడిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలను పోలీసు సంరక్షణలో అక్కడి నుంచి తరలించారు. పరిస్థితిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అంబేద్కర్ చౌరస్తా నుంచి మండల పరి షత్ కార్యాలయం వరకు 144 సెక్షన్‌ను విధించారు. ఏసీపీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం సీఐ మహ్మద్‌గౌస్, యాచారం సీఐ అశోక్‌కుమార్, ఎస్సైలు నర్సింహ, సంజీవరెడ్డి రంగంలోకి దిగి బలగాలను మోహరించారు.