పెళ్లి లారీ బోల్తా 50 మందికి గాయాలు
నల్గొండ: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి లారీ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి.. అందులో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామ శివారులో బుధవారం జరిగింది. వివరాలు.. మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతి పరిధిలోని రోటిగడ్డ తండకు చెందిన నరేష్ వివాహానికి వెళ్తున్న పెళ్లి వాహనం తక్కెళ్లపల్లి శివారుకు వెళ్లగానే ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
దీంతో లారీలో ఉన్న మీనవత్ బాష్య(75) అనే వ్యక్తి మృతిచెందగా.. మరో 50 మందికి గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందే విషయంపై స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ల సాయంతో క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.