Married woamn died
-
పెళ్లి రోజు జరుపుకోకుండానే..
కర్నూలు: తెల్లవారితే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పగిడ్యాలకు చెందిన గొల్ల పుల్లన్న కూతురు చంద్రకళ(23)కు ఏడాది క్రితం అల్లూరు గ్రామానికి చెందిన పాయల కృష్ణంరాజుతో వివాహమైంది. వారం రోజుల క్రితం పుట్టింటికి చేరుకుంది. భర్త కృష్ణంరాజు కూడా ఆదివారం ఉదయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత అల్లూరుకు వెళ్లాడు. తల్లిదండ్రులు కూడా పని మీద బయటకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె చంద్రకళ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. సోమవారం పెళ్లి రోజు వేడుక చేసుకోవాల్సిన కుమార్తె మృతి చెంది కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడపునొప్పి బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతు రాలి తల్లి వరలక్ష్మీ చెబుతోంది. సమాచారం మేరకు తహసీల్దార్ భారతి ఘటన స్థలానికి చేరి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముచ్చుమర్రి ఎస్ఐ నాగార్జున తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తిరుత్తణి : అనుమానస్పద రీతిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపల్లెలో బుధవారం జరిగింది. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన విజయ్ నేత కార్మికుడు. ఆర్కేపేటకు చెందిన విజయతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు ఏడాది వయస్సు పాప ఉంది. గత కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ తగాదాలు జరిగేవని దీంతో విజయ తన పుట్టింటికి వెళ్లిపోయింది. పది రోజుల కిందట ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి విజయను భర్తతో కాపురానికి పంపారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో బిడ్డ ఏడుపును విన్న సమీప కుటుంబీకులు వెళ్లి చూడగా అనుమానాస్పద రీతిలో ఉరేసుకుని విజయ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని విచారించే సమాయానికే ఆమె భర్త, అత్తమామలు పరారయ్యారు. కాగా వివాహం జరిగి మూడేళ్ల వ్యవధిలోనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై ఆర్డీవో విమల్‌రాజ్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పార్వతీపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అత్తమామలే చంపేశారు..! ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు. మద్యం మత్తులో... భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏఎస్పీ దర్యాప్తు... విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్,పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు తన సిబ్బందితోపా టు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుం బసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
వివాహిత దుర్మరణం
నరసాపురం అర్బన్ : నరసాపురం-పాలకొల్లు రోడ్డులో మత్స్యపురి వంతెన, కనకదుర్గ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా చినగొల్లపాలేనికి చెందిన సడగం సత్యవతి (32) మృతిచెందారు. నరసాపురం టౌన్ ఎస్సై వై.యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవతి భర్త శ్రీనివాసరావుతో కలసి మోటార్ సైకిల్‌పై యలమంచిలి మండలం బాడవ గ్రామానికి బంధువుల ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యలో ఉదయం 11.30 గంటల సమయంలో పట్టణంలోని మత్స్యపురి వంతెన దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న మరో మోటార్‌బైక్ హ్యాండిల్ వీరికి తగిలింది. దీంతో సత్యవతి కిందపడగా వెనుక వస్తున్న లారీ ఆమె పైనుంచి దూసుకుపోయింది. దీంతో సత్యవతి శరీరం నుజ్జునుజ్జుయింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. భర్త శ్రీనివాసరావు స్వల్పగాయూలతో బయటపడ్డారు. భార్య మృతితో అతను గుండెలవిసేలా రోదించాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.