బస్సుపై భారీ చెట్టు... అంతా సేఫ్
ఆమదాలవలస రూరల్: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామం వద్ద ఏబీ రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సుపై ఓ భారీ చెట్టు కూలింది. రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల చెట్టును ఆమదాలవలస వైపు నుంచి బత్తిలి వెళ్తున్న లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. అదే సమయంలో రోడ్డుకు ఇంకోవైపు ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సుపై చెట్టు కుప్ప కూలింది.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందరూ సీట్లలో కూర్చుని ఉండడంతో ఎవరూ గాయపడలేదు. చెట్టుపడిన బస్సు పైభాగం మాత్రం పూర్తిగా నుజ్జయింది.