యుద్ధవిమానాలకు త్వరలో మహిళా పైలట్లు
గయ: భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధవిమానాలకు త్వరలో మహిళలను పైలట్లుగా నియమించే అవకాశం ఉందని వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు. గయలో శనివారం రహా మాట్లాడుతూ, వైమానిక దళంలోని అన్ని విభాగాల్లో మహిళలు ఇప్పటికే పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారిని యుద్ధవిమానాల పైలట్లుగా నియమించే అవకాశం ఉందని అన్నారు.
యుద్ధవిమానాల పైలట్లుగా మహిళలకు తగిన శారీరక అర్హతలేదని, ప్రత్యేకించి గర్భిణీలుగా ఉన్నపుడు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు వారు ఇబ్బంది పడతారని అరూప్ రహా ఈ ఏడాది ప్రారంభంలో అన్నారు. అయితే ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.