Maruti sales up 7percent
-
స్విఫ్ట్ , బాలెనో బూస్ట్‌తో మారుతి స్పీడు
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది. దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది ఆ సంఖ్యను 1,27,999కు మెరుగుపర్చుకుంది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది. అయితే చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అలాగే వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు కూడా దాదాపు 10శాతం పడిపోయాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి. -
మారుతికి స్విఫ్ట్ , బాలెనో బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సూజుకీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్చి అమ్మకాల్లో 8.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ అమ్మకాలల్లో గణనీయమైన వృద్ధితో 7.7 శాతం కంపెనీ శనివారం వెల్లడించింది. దేశీయ అమ్మకాల్లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 1,29,345 యూనిట్ల నుంచి 1,39,763 యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా యుటిలిటీ కార్లు విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా 32శాతం అమ్మకాలతో మారుతి టాప్ గేర్ లో దూసుకుపోయింది దేశీయంగా గత ఏడాది మార్చిలో 1,18,895 యూనిట్లను విక్రయించిన మారుతి, ఈ ఏడాది 1,27,999 వాహనాలను విక్రయించింది. ఎగుమతుల విషయానికి వస్తే 12.6 శాతం వృద్ధితో 11,764 యూనిట్లుగా ఉంది. ముఖ్యంగా విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగాల అమ్మకాలు 31.8 శాతం ఎగబాకాయి. గత ఏడాది మార్చి 2016లో 13,894 యూనిట్ల అమ్మకాలతో తో పోలిస్తే ఈ ఏడాది 18,311 యూనిట్లను విక్రయించింది .వ్యాన్ల విభాగంలో ఈకో, ఓమ్నీల విక్రయాలు మాత్రం దాదాపు 10శాతం పడిపోయాయి. చిన్న కార్ల విభాగంలో మాత్రం కంపెనీ అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆల్టో, వేగనార్ అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. మిడ్ సైజ్ సెగ్మెంట్లో సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గాయి. అయితే కాంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, ఇగ్నిస్, రిట్జ్, సెలెరియో, బాలెనో, డిజైర్ల అమ్మకాలు 29.7 శాతం పెరిగాయి. ఇగ్నిస్, బాలెనో మోడళ్ళలో కొత్త వెర్షన్లను విడుదల చేయడంతో ఈ విభాగంలో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా 2015-16 సం.రంలో డొమెస్టిక్ మార్కెట్ లో 13.5ల క్షల వాహనాలతో పోలిస్తే 11 శాతం వృద్ధితో మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ మొత్తం విక్రయాలు 14.44 లక్షల యూనిట్లకు పెరిగాయి.