బాంబు కాదు.. మారుతీ స్పేర్ పార్ట్స్
న్యూఢిల్లీ : బాంబు ఏమోనని విమానశ్రయం సిబ్బదంతా ఒక్కసారిగా హడలిపోయారు. తీరా చూస్తే అవేమిటో తెలుసా? మారుతీ స్పేర్ పార్ట్స్. అసలు విషయానికి వెళ్తే.. ఢిల్లీ విమానశ్రయంలో కార్గో టెర్మినల్‌లో బుధవారం అనుమానాస్పద మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవేమిటో తెలియక తీవ్ర ఆందోళన చెందారు. ఆ మెటీరియల్నంతా వేరుచేసేశారు. బాంబు గుర్తింపు బృందానికి సమాచారమిచ్చారు.
అక్కడికి వచ్చిన బాంబు గుర్తింపు, నిర్మూలించే బృందం, అది బాంకు కాదని తేల్చేసరికి ఒక్కసారిగా ఢిల్లీ విమానశ్రయ సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అవి మారుతీ స్పేర్ పార్ట్స్‌గా బాంబు స్క్వాడ్ పేర్కొంది. విచారణ అనంతరం వాటిని బీడీడీఎస్ నెగిటివ్‌గా తేల్చింది. 2016 జనవరిలో కూడా ఐజీఐ ఎయిర్‌పోర్టు పరిధిలో అనుమానిత బాలూన్ను గుర్తించడంతో ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.