భోజనం కోసం ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆందోళన
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి మార్వెల్మెస్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు...హాస్టల్ లో ఆహారం సమయానికి పెట్టడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా హాస్టల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం నూజివీడు ఎమ్మార్వో ఇంతియాజ్ విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అంతేకాకుండా విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
(నూజివీడు)