అనంతపురం కోర్టు సంచలన తీర్పు
గుంతకల్లు: అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జిల్లా కోర్టు ఏడీజే సుమలత తీర్పును శుక్రవారం వెలువరించారు. వివరాలు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఓ బాలికను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన 2013 సెప్టెంబర్‌లో జరిగింది.
కేసు నమోదు చేసిన పోలీసులు మస్తాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, శుక్రవారం తుది విచారణ ముగిసిన అనంతరం మస్తాన్‌ను దోషిగా గుర్తించిన న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఏడీజే సుమలత బాధితురాలికి రూ. 3.5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.