ఆనందం అల్లరి చేస్తే..
ఆనందం అల్లరి చేస్తే ఎలా ఉంటుందో.. విల్లామేరీ డిగ్రీ కాలేజీలో సోమవారం కనిపించింది. బీబీఏ డిపార్ట్మెంట్ యాన్యువల్ మేనేజ్మెంట్ మీట్ ‘స్ట్రాటిజియా-ద పవర్ ఆఫ్ మైండ్’ కోలాహలంగా సాగింది. జోష్ ఫుల్గా సాగుతున్న ఈ ఈవెంట్లో విద్యార్థినులు మస్తీ మజా చేశారు. సెల్ఫీ ఫొటోలతో హంగామా సృష్టించారు. ఆటపాటలతో కాలక్షేపం చేశారు. ఈ నెల 14 వరకు జరిగే ఈ ఈవెంట్లో బిజినెస్ బజార్ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్, యాక్ససరీస్ సహా 10 రకాల స్టాల్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి.