mastizaade
-
'అప్పటివరకు అబ్బాయిలు నావైపే చూడలేదు'
న్యూఢిల్లీ: తాను ఎదుగుతున్న సమయంలో పెద్దగా అందం పట్ల శ్రద్ధగా చూపేదాన్ని కాదని, అందుకే 18 ఏళ్లు వచ్చేవరకు అబ్బాయిలు తనవైపే అసలు చూసేవారు కాదని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తెలిపింది. 'కాలేజీలో నేను చాలా మంచి విద్యార్థిని. కానీ కాలేజీకి వచ్చేవరకు మాత్రం సగటు విద్యార్థినే. నాకు బిజినెస్ ఎలా చేయడమో తెలుసు. మార్కెటింగ్ అంటే ఇష్టం. కానీ కాస్తా స్తబ్దుగా, మొద్దు విద్యార్థిలాగే ఉండేదాన్ని. నా టీనేజ్ వయస్సులో చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. తోటివాళ్లతో పెద్దగా కలువకపోవడంతో నాకు పెద్దగా స్నేహితులు లేరు' అని చెప్పింది. 'నాకు వీడియోలు ఎడిట్ చేయడం వచ్చు. ఫొటోషాప్ కూడా చేస్తాను. 18, 19 ఏళ్ల వయస్సులో చాలామందికి ఇవి వచ్చేవి కావు. 18 ఏళ్లు వచ్చేవరకు నాపై ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు' అని తెలిపింది. సన్నీ లియోన్ నటించిన తాజా సినిమా 'మస్తీజాదే' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపింది. బాలీవుడ్‌లోకి ప్రవేశించకముందు ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్‌గా సన్నీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల తన గతం గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చి సన్నీ అందరి మన్ననలు అందుకుంది. -
27 బికినీలు!
హాట్ స్టార్ సన్నీ లియోన్ కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మస్తీ జాదే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందట. అంటే.. జోరుగా హుషారుగా అన్నమాట. అసలు సన్నీ సినిమాలంటేనే ఈ రెండూ కామన్. కానీ, ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఉన్న హుషారు ఓ ఎత్తు.. ఈ చిత్రంలో ఉన్నది మరో ఎత్తు. ఎందుకంటే, ఒకటి కాదు.. రెండు కాదు.. సన్నీ ఏకంగా 27 బికినీల్లో కనిపించి, కనువిందు చేయనున్నారు. మిలప్ జవేరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు చూసి ఖంగు తిన్నారు. అంత బోల్డ్‌గా ఉంటుందట. సెన్సార్ బోర్డ్‌కు చెందిన మొదటి రెండు బోర్డ్స్ ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాయి. దాంతో ట్రిబ్యునల్‌కు పంపించారు. చివరకు ‘ఎ’ సర్టిఫికెట్తో సెన్సార్ సమస్య క్లియరైంది. మామూలుగా అయితే మే 1న విడుదల చేద్దామనుకున్నారు. సెన్సార్పరమైన ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారట. ఇక.. సన్నీ బికినీల విషయానికొస్తే.. ఈ చిత్రానికి పని చేసిన స్టయిలిస్ట్ ‘ఈ సినిమా మొత్తం మీరు దాదాపు బికినీల్లోనే కనిపిస్తారు. అందుకే మీరు సన్నబడాలి’ అని చెప్పగానే సన్నీ ‘అన్ని బికినీలా?’ అని ఆశ్చర్యపోయారట. చివరకు కన్విన్స్ అయ్యి, తగ్గారట. సన్నీ బికినీ బాడీ చూసి, ఆమె అభిమానులు స్వీట్ షాక్‌కి గురవుతారని చిత్రబృందం అంటోంది. -
ఎ సర్టిఫికెట్‌ను మించిన సినిమా!
సన్నీలియోన్ ఇప్పటివరకూ బాలీవుడ్లో చేసిన సినిమాలకు సెన్సార్ వాళ్లు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ప్రతి బాలీవుడ్ చిత్రంలోనూ కామనైపోయాయి సెన్సార్ సభ్యులు కూడా చూసి చూడన్నట్టు వదిలేస్తున్నారు. కానీ సెన్సార్ వాళ్లు కూడా మేము చూడలేం బాబోయ్ అని చేతులెత్తేస్తే...! అది ఏ సినిమా అనుకుంటున్నారా! . అసలు విషయంలోకి వెళితే... మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం ‘మస్తిజాదే’. ఈ సినిమా ట్రైలర్ చూసి షాకైన సెన్సార్ సభ్యులు ఇక సినిమా కూడా చూసి చేతులెత్తేశారు. ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట. దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ ‘ఎ’ సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ను ఎప్పుడో ఈ సినిమా దాటిపోయిందని వ్యాఖ్యానించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. -
సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో!
సన్నీ లియోన్ సెక్స్ సింబలే కావచ్చు. కానీ ఆమెతో కూడా నటించను గాక నటించను అనేవాళ్లున్నారు. నటి రిచా ఛడ్ఢా ఇప్పటికి సన్నీ లియోన్ తో కలిసి స్క్రీనుపై అందాలు పంచబోనని మూడో 'సారీ' చెప్పేసింది. మొదటి సారి రాగిణి ఎం ఎం ఎస్ 2లో , టీనా అండ్ లోలో సినిమాలో అవకాశం వచ్చినా ఈ అందాల భామ నో చెప్పేసింది. ఇప్పుడు తాజాగా మస్తీజాదే సినిమాలోనూ వచ్చిన అవకాశాన్ని కూడా రిచా వద్దనుకుంది. తమాషా ఏమిటంటే మూడు సినిమాల్లోనూ ప్రధానపాత్ర పోర్న్ సుందరిదే. మూడు శృంగార రస ప్రధాన చిత్రాలే. అయితే "ఈ సినిమాలను వదులుకోవడం, వాటిలో సన్నీ లియోన్ ఉండటం కేవలం కాకతాళీయమే. ఆమె ఉన్నందుకు నేనీ సినిమాల్ని వదులుకోలేదు" అని రిచా సంజాయిషీ ఇస్తోంది.