breaking news
Matthew Breetzke
-
చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో..
ఇంగ్లండ్ గడ్డ మీద తెంబా బవుమా బృందం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరవై ఏడేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుపై వన్డే సిరీస్ (END vs SA ODI Series) గెలిచింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. మంగళవారం లీడ్స్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తాజాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది సౌతాఫ్రికా.బ్రీట్జ్కే, స్టబ్స్ హాఫ్ సెంచరీలుటాపార్డర్లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (49), రియాన్ రికెల్టన్ (35) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తెంబా బవుమా (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 77 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (58), డెవాల్డ్ బ్రెవిస్ (42), కార్బిన్ బాష్ (32 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన సౌతాఫ్రికా 330 పరుగులు సాధించింది.ఆఖరి వరకు పోరాడినాఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆదిల్ రషీద్ రెండు, జేకబ్ బెతెల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది.ఇంగ్లండ్ ఓపెనర్లు జేమీ స్మిత్ (0), బెన్ డకెట్ (14) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ (61), నాలుగో నంబర్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (58) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 33 పరుగులు చేయగా.. మాజీ సారథి జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ (61)తో అదరగొట్టాడు. ఇక విల్‌జాక్స్ 39 పరుగులు చేయగా.. ఆర్చర్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ (14 బంతుల్లో 27 నాటౌట్) ఆడాడు.నరాలు తెగే ఉత్కంఠఅయితే చివరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 16 పరుగులు అవసరం కాగా.. సకీబ్ మహమూద్ (2*), ఆర్చర్ విజయం దిశగా జట్టును తీసుకెళ్లారు. తొలి బంతికి సకీబ్ ఒక పరుగు తీయగా.. మూడో బంతికి ఆర్చర్ ఫోర్ కొట్టాడు. మరలా ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఫలితంగా ఆఖరి బంతికి ఆరు పరుగులు చేస్తే సూపర్ ఓవర్ అవసరమయ్యేది. అయితే, సేన్ ముత్తుస్వామి ఇన్సైడ్ ఎడ్జ్‌గా అద్భుత బంతి సంధించగా.. ఆర్చర్ ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా ఐదు పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.బ్రీట్జ్కే ప్రపంచ రికార్డు.. బవుమా బృందం సరికొత్త చరిత్రకాగా వన్డేల్లో ఆడిన తొలి మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా మాథ్యూ బ్రీట్జ్కే ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు వన్డేల్లో కలిపి అతడు 463 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ గడ్డ మీద.. 1998లో చివరగా సౌతాఫ్రికా వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. చదవండి: IPL 2026: గుజరాత్ టైటాన్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర వీరుడు? -
సౌతాఫ్రికా ఆటగాడి సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
అంతర్జాతీయ వన్డేల్లో సౌతాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బ్రీట్జ్కే మరోసారి దుమ్ములేపాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ప్రోటీస్‌ను మార్క్రమ్తో కలిసి ఈ యువ ఆటగాడు ఆదుకున్నాడు. కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..ఇక ఈ మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన బ్రీట్జ్కే ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుతో మ్యాచ్‌లో వన్డే అరంగేట్రం చేసిన .. 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అనంతరం పాకిస్తాన్‌తో వన్డేలో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే.. రెండో వన్డేలో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 88 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు తను ఆడిన ఐదు వన్డేల్లో 463 పరుగులు చేశాడు. తద్వారా తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ ఆటగాడు టామ్ కూపర్(374) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కూపర్ రికార్డును మాథ్యూ బ్రేక్ చేశాడు. -
సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర
సౌతాఫ్రికా స్టార్ మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) వన్డేల్లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నాడు. ఆడిన తొలి మూడు వన్డేల్లో అద్భుత రీతిలో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లోనూ దుమ్ములేపాడు.ఇరవై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో ఉన్న వేళ.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన బ్రీట్జ్కే ధనాధన్ దంచికొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubbs- 74)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 78 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ ట్రాప్‌లో పడిన బ్రీట్జ్కే.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాఏదేమైనా అద్భుత మెరుపు శతకంతో ఆకట్టుకున్న బ్రీట్జ్కే ఈ సందర్భంగా అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.నవజ్యోత్ సింగ్ కూడా సాధించినా..ఇంతకు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తొలి నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇందుకు అతడికి ఐదు మ్యాచ్‌లు అవసరమైతే.. బ్రీట్జ్కే మాత్రం నాలుగు వన్డేల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.కాగా 1987 ప్రపంచకప్ సందర్భంగా సిద్ధు ఆస్ట్రేలియా మీద 73, న్యూజిలాండ్ మీద 75, ఆస్ట్రేలియా మీద 51, జింబాబ్వే మీద 55 పరుగులు సాధించాడు. అయితే, మధ్యలో మూడో వన్డేను అతడు మిస్సయ్యాడు.అరంగేట్రంలోనే అత్యధిక స్కోరుమరోవైపు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా 2025లో వన్డేల్లో అడుగుపెట్టిన 26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కే.. అరంగేట్రంలోనే భారీ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి.. 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అనంతరం పాకిస్తాన్‌తో వన్డేలో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే.. రెండో వన్డేల్లో 88 పరుగులు చేశాడు. తద్వారా ఆడిన తొలి నాలుగు వన్డేల్లో 96.67 సగటుతో 378 పరుగులు సాధించాడు బ్రీట్జ్కే.సౌతాఫ్రికా ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (8), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జీ (38) ఫర్వాలేదనిపించాడు.మాథ్యూ బ్రీట్జ్కే (88) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్ (74) కూడా రాణించాడు. మిగిలిన వారిలో వియాన్ ముల్దర్ 26, కేశవ్ మహరాజ్ 22* ఫర్వాలేదనిపించారు. ఇక ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్నస్ లబుషేన్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు కూల్చారు. జోష్ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.బవుమాకు రెస్ట్మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన సౌతాఫ్రికా.. టీ20 సిరీస్‌లో ఆసీస్ చేతిలో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో టెంబా బవుమా సారథ్యంలో 98 పరుగుల తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో టెస్టుకు బవుమా విశ్రాంతి తీసుకోగా.. మార్క్రమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Asia Cup 2025: మెగా టోర్నీకి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం! -
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
వన్డే క్రికెట్‌కు సరికొత్త స్టార్ పరిచమయ్యాడు. అతడి పేరు మాథ్యూ బ్రీట్జ్కే (26). సౌతాఫ్రికాకు చెందిన ఈ కుడి చేతి వాటం వికెట్‌కీపర్ బ్యాటర్.. తన తొలి మూడు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనలు చేసి ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేశాడు. అరంగేట్రం వన్డేలో న్యూజిలాండ్‌పై భారీ సెంచరీ (148 బంతుల్లో 150) చేసిన బ్రీట్జ్కే.. ఆతర్వాత వరుసగా రెండు వన్డేల్లో (పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియాపై) హాఫ్ సెంచరీలు (83, 57) బాదాడు. తద్వారా వన్డే క్రికెట్లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక స్కోర్ (290 పరుగులు) చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ నిక్ నైట్ పేరిట ఉండేది. నైట్ తన తొలి మూడు వన్డేల్లో 264 పరుగులు చేశాడు. ఈ విభాగంలో నైట్ తర్వాత స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన టెంబా బవుమా (259) ఉన్నాడు.తొలి మూడు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేయడంతో బ్రీట్జ్కే మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ, మ్యాక్స్ ఓడౌడ్ తర్వాత చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.బ్రీట్జ్కే ఇవాళ (ఆగస్ట్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బ్రీట్జ్కేతో పాటు మార్క్రమ్ (82), బవుమా (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రికెల్టన్ (33), ముల్దర్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హెడ్ (27), డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదేయగా.. నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి తలో 2, సుబ్రాయన్ ఓ వికెట్ తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.