గీత స్మరణం: మావేలే మావేలే
పల్లవి : ఆమె: మావేలే మావేలే
పరువాలు మావేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మళ్లీ రాదు
బృందం: వారెవ్వా బాబయ్య
॥ మావేలే॥
చరణం : 1
ఆ: పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు
బృం: చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ
ఆ: చిలకే ఎగిరొస్తే విదిలించుకోవద్దు
బృం: రావొద్దూ రావొద్దూ మళ్లీ మళ్లీ రావొద్దు
ఆ: పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు
పడుచుకి పూవందం మరిచిపోవద్దు
లక్షలు అడిగేనా లగ్నం నేనడిగేను
ముహూర్తం పెట్టించు రేపో మాపో
॥ మావేలే॥
చరణం : 2
ఆ: పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు
బృం: పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ
ఆ: కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ
బృం: పాడొద్దు పాడొద్దు హద్దుమీరి పాడొద్దు
చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే
దొరకీ దొరకనట్టు జారుకోవద్దూ
పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు
అనుభవించాలి నేడే నేడే
॥ మావేలే॥
గానం : మిన్మిని, బృందం
పల్లవి : చికు బుకు చికు బుకు రైలే అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే
॥ చికు॥
దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జనఘోష
చెంగు తగిలితే కలుగును శోష
॥ చికు॥
చరణం : 1అహ... సైకిలెక్కి మేం వస్తుంటే
మీరు మోటర్ బైకులే చూస్తారు
అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే
మీరు మారుతీలు వెతికేరు
అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే
మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు
అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏవి కావాలో మారు అర్థం కాలేదే
పూలబాణాలేశామే పిచ్చివాళ్లయి పోయామే
॥ చికు॥
చరణం : 2 మాకు ఆటపాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే
మా మతులు చెదిరి తల నెరుపొచ్చే
రాదులే వయసు మళ్లీ
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు
మీరు ఇపుడే లవ్చేస్తే మూడుముళ్లు పడనిస్తే
కన్నవాళ్లకు అది మేలు చిన్నవాళ్లకు హ్యాపీలు
॥ చికు॥
చిత్రం : జెంటిల్మేన్ (1993), రచన : రాజశ్రీ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, గానం : సురేష్ పీటర్
- నిర్వహణ: నాగేష్