maxim magazine
-
అందాలారబోత తప్పు కాదు!
తమిళసినిమా: అందాలను ప్రదర్శించకుండా ఎవరూ ఉండరని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అంటోంది. పైగా అది తప్పుకూడా కాదని చెబుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌లలో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న నటి ఈ ఉత్తరాది బ్యూటీ. అయినప్పటికీ మరిన్ని అవకాశాల వేటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తన చర్యలే కారణం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య ఈ యమ్మడు కురుస దుస్తులతో ఒక ఆంగ్ల పత్రికకు సెక్సీగా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. అందుకు పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కింటి ఆమ్మాయిలా ఉండే మీరిలాంటి ఫోజులివ్వొచ్చా అని అభిమానుల నుంచి ప్రశ్నల దాడి జరుగుతోందట. దీనికి స్పందించిన రకుల్ గ్లామర్‌కు మారాలన్నది తన భావన కాదని, అలా చాలా చిత్రాల పాటల్లో నటించానని అంది. అయినా గ్లామర్‌గా నటించడం తప్పేమి కాదని చెప్పుకొచ్చింది. రంగు, శరీర సంపద కచ్చితమైన కొలతల్లో ఉంటే గ్లామరస్‌గా నటించవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ఏ నటి అయినా అందాలారబోయకుండా ఉండదని అంది. ఇకపోతే సినిమా అవకాశాల వేటలో ఉండే నటీమణులను పడకగదికి పిలిచే పరిస్థితి నెలకొందని అంటున్నారని, లైంగిక వేధింపులు ఒక్క సినిమాలోనే కాదు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నాయని చెప్పింది. అయితే అవి బయటకు తెలియడం లేదనీ అంది. మీకు అలాంటి పరిస్థితి ఎదురైందా అని అడుగుతున్నారని, తాను చాలా చిత్రాల్లో నటించానని, అయినా ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి తనకు ఎదురవలేదని చెప్పింది. అయినా సినిమా అవకాశాల కోసం ఎవరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని అంది. తానీ రంగంలోకి రాక ముందు అందాల పోటీల్లో పాల్గొన్నానని, అయితే అక్కడ జయించలేకపోయానని తెలిపింది. ఆ పోటీలు జరిగిన ఏడేళ్లు అయ్యిందని, ఇప్పుడు అలాంటి పోటీలకు తనను జడ్జిగా ఆహ్వానిస్తున్నారని చెప్పింది. జయాపజయాలనేవి జీవితంలో ఒక భాగమేనని, అయితే ఆ అనుభవాలు జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్నిస్తాయిని రకుల్ అంటోంది. -
‘నాకు లేని అభ్యంతరం వారికెందుకు?’
సాక్షి, సినిమా : దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్లో ‘అయ్యారీ’తో ప్రేక్షకులను పలకరించబోతోంది రకుల్. ఈ క్రమంలో ఓవైపు హీరో సిధార్థ్ మల్హోత్రాతోపాటు చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంది. మరోవైపు హాట్ ఫోటో షూట్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్ ఒక్కసారిగా ‘అలా’ కనిపించేసరికి ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రకుల్ స్పందించింది. వారికేమైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆమె మాంచి సమాధానమే ఇచ్చింది. ‘ఆ ఫోటోషూట్‌పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు. కెరీర్లో ఒక్కసారైనా ప్రముఖ మాగ్జైన్ కవర్ పేజీలపై మెరవాలన్న కోరిక ప్రతీ నటీనటులకు ఉంటుంది. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా. అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు. నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోనని ఆమె తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్ వివరించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన అయ్యారీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సిధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయి, రకుల్ ప్రధాన పాత్రలు పోషించారు. Sending you all a little love this Feb with my cover for @maxim.india #rakulformaxim ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Feb 6, 2018 at 11:44pm PST -
టాప్ 100 హాట్ బ్యూటీలలో మనోళ్లు ఇద్దరు!
ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరని ఒక పోల్ జరిగింది. మాగ్జిమ్ అనే పత్రిక ఈ పోల్ నిర్వహించింది. 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే టాప్ 100 హాట్ బ్యూటీలను ఎంపిక చేసింది. ఆ లిస్టులో అందరికంటే అగ్రస్థానంలో ప్రముఖ మోడల్ హెయిలీ బాల్డ్విన్ నిలిచింది. టాప్ 100 జాబితాలో బాలీవుడ్ భామలు దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా కూడా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో ఎమ్మా వాట్సన్, ఎమ్మా స్టోన్, డకోటా జాన్సన్, కెండల్ జెన్నర్ తదితరులు చాలా మంది ఉన్నారు. హాలీవుడ్లో నటించిన తొలి సినిమా ట్రిపుల్ ఎక్స్‌తోనే దీపికకు బ్రహ్మాండంగా ప్రశంసలు లభించాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా క్వాంటికో అనే అమెరికన్ టీవీ సిరీస్‌తో హాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ వారంలోనే ఆమె తొలిసారిగా నటించిన బేవాచ్ సినిమా కూడా రానుంది.