అందాలారబోత తప్పు కాదు! | Behind Scenes of Rakul Preet Singh Maxim Photo Shoot | Sakshi
Sakshi News home page

అందాలారబోత తప్పు కాదు!

Published Sun, Feb 25 2018 4:35 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Behind Scenes of Rakul Preet Singh Maxim Photo Shoot - Sakshi

రకుల్‌ప్రీత్‌సింగ్‌

తమిళసినిమా: అందాలను ప్రదర్శించకుండా ఎవరూ ఉండరని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంటోంది. పైగా అది తప్పుకూడా కాదని చెబుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌లలో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న నటి ఈ ఉత్తరాది బ్యూటీ. అయినప్పటికీ మరిన్ని అవకాశాల వేటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తన చర్యలే కారణం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య ఈ యమ్మడు కురుస దుస్తులతో ఒక ఆంగ్ల పత్రికకు సెక్సీగా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందుకు పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కింటి ఆమ్మాయిలా ఉండే మీరిలాంటి ఫోజులివ్వొచ్చా అని అభిమానుల నుంచి ప్రశ్నల దాడి జరుగుతోందట. దీనికి స్పందించిన రకుల్‌ గ్లామర్‌కు మారాలన్నది తన భావన కాదని, అలా చాలా చిత్రాల పాటల్లో నటించానని అంది. అయినా గ్లామర్‌గా నటించడం తప్పేమి కాదని చెప్పుకొచ్చింది. రంగు, శరీర సంపద కచ్చితమైన కొలతల్లో ఉంటే గ్లామరస్‌గా నటించవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ఏ నటి అయినా అందాలారబోయకుండా ఉండదని అంది.

ఇకపోతే  సినిమా అవకాశాల వేటలో ఉండే నటీమణులను పడకగదికి పిలిచే పరిస్థితి నెలకొందని అంటున్నారని, లైంగిక వేధింపులు ఒక్క సినిమాలోనే కాదు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నాయని చెప్పింది. అయితే అవి బయటకు తెలియడం లేదనీ అంది. మీకు అలాంటి పరిస్థితి ఎదురైందా అని అడుగుతున్నారని, తాను చాలా చిత్రాల్లో నటించానని, అయినా ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి తనకు ఎదురవలేదని చెప్పింది.

అయినా సినిమా అవకాశాల కోసం ఎవరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని అంది. తానీ రంగంలోకి రాక ముందు అందాల పోటీల్లో పాల్గొన్నానని, అయితే అక్కడ జయించలేకపోయానని తెలిపింది. ఆ పోటీలు జరిగిన ఏడేళ్లు అయ్యిందని, ఇప్పుడు అలాంటి పోటీలకు తనను జడ్జిగా ఆహ్వానిస్తున్నారని చెప్పింది. జయాపజయాలనేవి జీవితంలో ఒక భాగమేనని, అయితే ఆ అనుభవాలు జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్నిస్తాయిని  రకుల్‌ అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement