మేయర్ మాకు... డిప్యూటీ మీకు
1956లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనమయ్యాయి. పాలనలో సికింద్రాబాద్కు పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించేలా ఒప్పందం కుదిరింది.
1. మొత్తం స్థానాల్లో 30 శాతం సికింద్రాబాద్ ఏరియాలో ఉండాలి.
2. మేయర్ హైదరాబాద్కిస్తే, డిప్యూటీ సికింద్రాబాద్కు ఇవ్వాలి.మేయర్ పదవీకాలం ఏడాదే..
విలీనానికి ముందు సికింద్రాబాద్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 30 మంది కౌన్సిలర్లను ఎన్నుకునేవారు. మేయర్ పదవీ కాలం ఏడాది. సికింద్రాబాద్ తొలి మేయర్ వాసుదేవ మొదలియార్(1951-52), డిప్యుటీ మేయర్ డాక్టర్ వైఎన్ తిమ్మరాజులు. ఈ ఎన్నికల్లో ఈశ్వరీబాయి (చిలకలగూడ), సుశీలాదేవి(జీరా)లు కౌన్సిలర్లుగా గెలుపొంది కార్పొరేషన్లో తమ వాణి వినిపించారు.