mayuri in lodge
-
మిస్‌ఫైర్‌పై కొనసాగుతున్న విచారణ
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : పట్టణంలోని మయూరి ఇన్‌లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రాయికల్ ఎస్సై రాములునాయక్‌ను మంగళవారం స్థానిక పోలీసులు విచారించినట్లు సమాచారం. సోమవారం ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు డీఎస్పీ మాధవరెడ్డి, రూరల్ సీఐ రఘు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాడ్జిలోని 212 గదిని పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలడిగి తెలుసుకున్నారు. సోమవారం సేకరించిన ఆధారాల ప్రకారం మంగళవారం విచారణ కొనసాగించారు. అప్పటికే రాములునాయక్‌పై సెక్షన్ 286, 337 కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సై విచారణలో దోషిగా తేలితే చట్టపరమైన చర్యలతోపాటు శాఖ పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం...! కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములునాయక్ జిల్లా దాటి నిర్మల్‌కు రావడం, కుంటాల జలపాతంలో విందు చేసుకోవడం.. పైగా దీనికి అధికారికంగా సెలవు తీసుకోకుండా రావడం ఆయన విధినిర్వహణపై ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది. ఆది నుంచి దూకుడు స్వభావంతో పనిచేసే ఎస్సైగా రాములునాయక్‌కు పేరుందని సమాచారం. విధి నిర్వహణలో భాగంగా అత్యవసర సమయంలో ఉపయోగించే సర్వీస్ రివాల్వర్ రెండు రౌండ్లు పేల్చడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే రివాల్వర్ నుంచి ఒక్క తూటా బయటపడిన అనంతరం అప్రమత్తమై మరోరౌండ్ తూటా పేలకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ వెనువెంటనే తుపాకీ నుంచి రెండు బుల్లెట్లు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. సెటిల్మెంట్ కోసమేనా..? రాయికల్ ఎస్సై అసలు నిర్మల్‌కు ఎందుకు వచ్చినట్లు..? కరీంనగర్ జిల్లా ఎంఈవోలతో కలిసి కుం టాల జలపాతానికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణం లో నిర్మల్‌లో ఎందుకు ఆగారు..? ఆయనకు నిర్మల్ డివిజన్లోని ఎంపీడీవోలు, ఈవోపీర్డీలు లాడ్జీలో విం దు ఎందుకు ఏర్పాటుచేశారు..? వీరి కలయిక వెనక సెటిల్మెంట్ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..! అ నేది పట్టణంలో చర్చనీయాంశమైంది. నిర్మల్ డివి జన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కొందరు ఎ న్నికల కంటే ముందు కరీంనగర్ జిల్లాలో పనిచేయడంతో ఎస్సైతో సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ బంధం ఏమైనా ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చిందా..? అయితే.. ఒకే గదిలో ఉద్యోగులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎస్సై రివాల్వర్ పేలడం ప్రమాదవశాత్తు జరిగింది కాదేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేటు పడే అవకాశం? : ఎస్సై రివాల్వర్ తూటాలు ఉపయోగిస్తే ఎందుకు, ఎప్పుడు వినియోగించారన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన లెక్కచూపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఎస్సైపై వేటువేసేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
పోలీస్ (మిస్) ఫైర్..!
ఎస్సై చేతిలోని రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. పట్టణంలోని లాడ్జిలో స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో లాడ్జిలో పనిచేస్తున్న సర్వర్‌బాయ్ కాలికి స్వల్ప గాయమైంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. - ఎస్పీ పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జిలో జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఎస్పీ సోమవారం రాత్రి నిర్మల్‌లోని మయూరి ఇన్ లాడ్జిలో సంఘటన జరిగిన గదిని పరిశీలించారు. అనంతరం ఆయన డీఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. లా డ్జిలో రెండు రౌండ్ల కాల్పులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలుతీసుకుంటామని పేర్కొన్నారు. నిర్మల్ అర్బన్ : కరీంనగర్ జిల్లా రా యికల్ ఎస్సై రాములు నాయక్ ఆది వారం నిర్మల్‌కు వచ్చారు. అనంతరం తన స్నేహితులైన నిర్మల్ డివిజన్‌కు చెందిన కొందరు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి రాత్రి నిర్మల్‌లోని మ యూరి ఇన్ లాడ్జి లో 212 నంబర్ గదిలో దిగా రు.రాత్రి స్నేహి తులతో కలిసి విం దు చేసుకున్నారు. సుమారు 11గంటల సమయంలో రివాల్వర్ కిందపడి పేలింది. ఈ ఘటనలో మద్యం సీసాలు పగిలినట్లు సమాచారం. అదే సమయంలో గదిలోకి సర్వర్ బాయ్ బాలు వచ్చాడని, బుల్లెట్‌తో దెబ్బతిన్న గచ్చు బాలు కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైందని పోలీసులు తెలిపారు. కాగా, రాయికల్ ఎస్సైరాములు నాయక్ ఉన్న గది.. నిర్మల్ డివిజన్లోని ఓ మండల ఎంపీడీవో పేరిట బుక్ చేసినట్లు లాడ్జి రికార్డుల్లో ఉంది. ఆదివారం మధ్యాహ్నమే ఈ గది బుకింగ్ చేసినట్లు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. పోలీసుల విచారణ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం డీ ఎస్పీ మాధవ్‌రెడ్డి లాడ్జిలోని 212 గదిలోకి వెళ్లారు. బుల్లెట్‌తో దెబ్బతిన్న నేల, గదిని పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఎస్సై రివాల్వర్ కిందపడడంతోనే మిస్‌ఫైర్ అయి ఉంటుం దని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రఘు, పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి ఉన్నారు. ఘటనపై అనుమానాలు.. గదిలో ఉన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే ఫైర్ జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. గదిలో సుమారు ఐదుగురు ఉన్న ట్లు సమాచారం. అంతేకాకుండా సర్వ ర్ బాయ్‌పై ఆగ్రహంతో ఫైర్ చేసి ఉం టారనే అనుమానాలూ వినిపిస్తున్నా యి. అయితే ఎందుకు ఎస్సై రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు బయటకు వ చ్చాయనే సంగతి ఇంకా తేలాల్సి ఉంది.