ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను 7వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్శిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డా. కె. ఈశ్వరప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీ సెలవు దినంగా శుక్రవారాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో పరీక్షలను మరుసటి రోజు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు.