MCC Spirit of Cricket
-
ఇది కదా క్రికెటింగ్ స్పిరిట్ అంటే.. అవకాశం దొరికినా..!
నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్ జెన్కిన్స్ మార్టిన్ (CJM) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) 2023 మార్చి 21న ప్రకటించింది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఆసిఫ్ 2022 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా ఔట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తన చర్య వల్ల జెంటిల్మెన్ గేమ్ యొక్క ప్రతిష్ఠను పెంచినందుకు గాను ఆసిఫ్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కూడా దక్కింది. Nepal's Aasif Sheikh has won a Spirit of Cricket Award for this special moment ❤️ pic.twitter.com/FrkBT1y3jC — England's Barmy Army (@TheBarmyArmy) March 20, 2023 అసలేం జరిగిందంటే.. 2022 ఫిబ్రవరిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కమల్ సింగ్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మార్క్ అదైర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదైర్ కొట్టిన షాట్ అతనికి కాళ్లకే తాకి లెగ్‌సైడ్ దిశగా వెళ్లింది. బౌలర్ బంతి కోసం పరుగు పెట్టే క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను పిచ్ మధ్యలో కింద పడిపోయాడు. మెక్‌బ్రైన్ లేచి పరుగు పూర్తి చేసే లోపు బౌలర్ బంతిని వికెట్‌కీపర్ ఆసిఫ్‌కు చేరవేయగా, అతను రనౌట్ చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు. అయితే, తమ బౌలర్ ఢీకొట్టడం వల్లనే మెక్‌బ్రైన్ కిందపడి రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడని భావించిన ఆసిఫ్.. అతన్ని రనౌట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో మెక్‌బ్రైన్ విజయవంతంగా పరుగు పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలో ఆసిఫ్ చూపిన క్రీడాస్పూర్తికి యావత్ క్రీడాప్రపంచం జేజేలు పలికింది. క్రికెట్ విశ్లేషకులు ఆసిఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ణీత ఓవరల్లో 127 చేయగా.. ఛేదనలో నేపాల్ 111 పరుగులకు మాత్రమే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమో లేదో తెలీదు, అతన్ని ఔట్ చేసుంటే మాత్రం క్రీడాస్పూర్తి అనే మాటకు అర్ధం లేకుండా పోయేది అంటూ మెచ్యూర్డ్ కామెంట్స్ చేశాడు. కాగా, సీజేఎమ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్లు, టెస్ట్ జట్ల కెప్టెన్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని మాథ్యూ వేడ్ ఔట్ అయినప్పటికీ బట్లర్ అప్పీల్ చేయకుండా వదిలిపెట్టాడు. బెన్ స్టోక్స్ విషయానికొస్తే.. పాక్‌పై సిరీస్ విక్టరీ అనంతరం స్టోక్స్.. యువ ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ట్రోఫీ అందించి క్రీడాస్పూర్తిని చాటాడు. అలాగే ఈ సిరీస్ ఆడటం ద్వారా తనకు వచ్చే పారితోషికం మొత్తాన్ని పాక్‌లో వరద బాధితులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
దురదృష్టమంటే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అఖరి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ విచిత్రకర రీతిలో పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 55 ఓవర్ వేసిన జాక్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ నాన్ స్ట్రైకర్‌వైపు భారీ షాట్ ఆడాడు. అయితే బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్ బ్యాట్‌కు తగిలి.. మిడ్-ఆఫ్ ఫీల్డర్ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్ నిరాశగా మైదానాన్ని వీడాడు. అయితే నికోల్స్ ఔట్‌కాగానే ఇంగ్లండ్ బౌలర్లు సంబురాలు జరుపుకోగా, బౌలర్ లీచ్ మాత్రం ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పందించిన మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ నికోల్స్ ఔటైన విధానంపై మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో వెల్లడించింది. "దురదృష్టకరమైన రీతిలో నికోల్స్ తన వికెట్‌ను కోల్పోయాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి ఉంది. నియమం 33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్, అంపైర్, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది" అని మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. బ్రాడ్ (2/45), లీచ్ (2/75)ల దెబ్బకు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను డరైల్ మిచెల్ (78 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 An unfortunate dismissal? Yes. But wholly within the Laws. Law 33.2.2.3 states it will be out if a fielder catches the ball after it has touched the wicket, an umpire, another fielder, a runner or the other batter. Read the Law: https://t.co/cCBoJd6xOSpic.twitter.com/eKiAWrbZiI — Marylebone Cricket Club (@MCCOfficial) June 23, 2022 -
సాక్ష్యాల సేకరణ ఇంత నిర్లక్ష్యంగానా?
* ఐసీసీ ఏసీయూపై మెకల్లమ్ ధ్వజం * ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్లో ఉపన్యాసం లండన్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా సేకరించే సాక్ష్యాలపై ఐసీసీ ఏమాత్రం భద్రత, ప్రొఫెషనలిజం లేకుండా వ్యవహరిస్తోందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ధ్వజమెత్తారు. సోమవారం ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008లో మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు కివీస్ మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్న్స్ పలుమార్లు తనను సంప్రదించారని ఐసీసీ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ)కు మెకల్లమ్ సాక్ష్యమిచ్చారు. అయితే మెకల్లమ్ చెప్పిన విషయాలు విచారణ జరుగుతుండగానే 2014లో డెయిలీ మెయిల్ పత్రికలో దర్శనమిచ్చాయి. ‘నేను ఆరోజు ఐసీసీ ఏసీయూకు చెప్పిన విషయాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అయితే ఐసీసీ అధికారులు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా యథాలాపంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనలిజం కొరవడింది. నా మాటలన్నీ మీడియాలో రావడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఇప్పటికీ అది ఎలా లీక్ అయ్యిందో ఐసీసీ నాకు చెప్పలేదు. ఎవర్నీ నమ్మలేకుండా ఉన్నాం. ఇలా అయితే మున్ముందు ఏ ఆటగాడు ధైర్యంగా మీకు సాక్ష్యమిస్తాడు? క్రికెట్ అత్యున్నత బాడీపైనే ఆటగాళ్లకు విశ్వాసం సన్నగిల్లితే పరిస్థితేమిటి? నిజంగానే మీకు ఫిక్సింగ్ జాడ్యాన్ని తరిమికొట్టాలనుకుంటే బలమైన నిర్మాణం గల బాడీ అవసరం’ అని మెకల్లమ్ తేల్చి చెప్పారు. ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటాం: ఐసీసీ న్యూఢిల్లీ: ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా మెకల్లమ్ చొరవ అభినందనీయమని ఐసీసీ కొనియాడింది. అలాగే భవిష్యత్‌లో సాక్ష్యాల సేకరణలో ఆటగాళ్ల నమ్మకాన్ని చూరగొంటామని పేర్కొంది. అయితే మెకల్లమ్ సాక్ష్యాలను లీక్ చేసింది ఐసీసీలోని అధికారులు కాదని, బయటివారైనా కనుగొనడం కష్టసాధ్యమేనని అంగీకరించింది. మున్ముందు ఏసీయూను మరింత పకడ్బందీగా తయారుచేస్తామని తెలిపింది.