మంత్రి ‘కడియం’ను తొలగించాలి
నిర్మల్రూరల్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధిత మంత్రి కడియం శ్రీహరిని బాధ్యుడిని చేస్తూ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
న్యాయబద్ధంగా పరీక్ష రాసిన విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గతంలో ఆరోపణలు వస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను తొలగించారని, ఇప్పుడు కడియం శ్రీహరిని కూడా తప్పించాలని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో ఎంసెట్ రాసి ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ ఘటనతో ఆవేదన చెందుతున్నారని, వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. సర్కారు సరైన న్యాయం చేయని పక్షంలో టీడీపీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.