ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం : డి. శ్రీనివాస్
రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్
చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్): మహారాష్ట్ర ప్రభుత్వం తో సీఎం కేసీఆర్ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంటే ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం మోసపూరితమైందని, తెలంగాణను తాకట్టుపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం తగదన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా పరిపాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా పనులు మాత్రం జరగలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహెట్టి బ్యారేజీ 152 అడుగుల ఎత్తులో నిర్మాణంపై ఒప్పంథ దం జరగలేదని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పిన మాట వాస్తవమేనని డీఎస్ అన్నారు.