మక్కాబాధిత కుటుంబాలకు పరిహారం
మక్కా ప్రమాదంలో మరణించిన ఫాతిమా, ఖాదర్ కుటుంబ సభ్యులకు సీఎం పరిహారం అందజేశారు. ఇవాళ విజయవాడలో మృతుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి మూడులక్షల రూపాయల చెక్కులు అందించారు. ఇటీవల బందరు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మక్కా భాదితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్కరాల బాధితులతో సమానంగా.. మక్కాబాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.