Medan
-
జీఎంఆర్‌కు కౌలనాము ఎయిర్పోర్ట్ నిర్వహణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండోనేషియాలోని మెడాన్లో ఉన్న కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అంకస పుర అవియాసి ప్రారంభించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఇండోనే షియా ప్రభుత్వ సంస్థ పీటీ అంకస పుర–2 సంయుక్త భాగస్వామ్య కంపెనీయే అంకస పుర అవియాసి. జేవీలో జీఎంఆర్‌కు 49% వాటా ఉంది. జీఎంఆర్ నిర్వహణలో ఆగ్నే యాసియాలో ఇది రెండవ విమానాశ్రయ ప్రాజెక్టు. 25 ఏళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులను జేవీ చేపడుతుంది. -
జీఎంఆర్ చేతికి ఇండోనేషియా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాలో భాగమైన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) తాజాగా ఇండోనేషియాలో ఒక విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. మెడాన్‌లోని క్వాలానాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు కోసం అత్యధికంగా బిడ్ చేసిన సంస్థగా నిల్చింది. మెడాన్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ అథారిటీ అయిన అంకాశ పురా 2 (ఏపీ2) ఈ విషయాన్ని ప్రకటించినట్లు జీఎంఆర్ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామి ఎంపికకు సంబంధించి గెలుపొందిన బిడ్డర్‌గా తమ సంస్థ పేరును ఖరారు చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఏపీ2కు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. బిడ్డింగ్ లాంఛనాలు పూర్తి చేశాక, వచ్చే కొద్ది రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు దక్కించుకోవడంపై జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ (ఇంధనం, అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగం) శ్రీనివాస్ బొమ్మిడాల హర్షం వ్యక్తం చేశారు. మెడాన్ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇండొనేషియాలోని ఇన్ఫ్రా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన పేర్కొన్నారు. -
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు
జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతోపాటు సిబ్బంది 113 మంది మరణించారు. అయితే ఈ విమానం నివాస భవనాలపై పడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.