విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు | Indonesian plane crash toll rises to 141 | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు

Published Wed, Jul 1 2015 9:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు

విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు

జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతోపాటు సిబ్బంది 113 మంది మరణించారు. అయితే ఈ విమానం నివాస భవనాలపై పడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement