బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
దండేపల్లి, న్యూస్‌లైన్ :మండలంలోని మేదరిపేట బస్టాండ్ వద్ద బుధవారం బస్సు ఢీకొని జన్నారం మండలం మందపెల్లికి చెందిన వృద్ధురాలు కోమటి నర్సవ్వ తీవ్రంగా గాయపడింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. నర్సవ్వ మంగళవారం మామిడిపల్లిలో ఉంటున్న కొడుకులు మల్లయ్య, ప్రసాద్ ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం ఉడుంపూర్లో ఉన్న కూతురు ఇంటికి వెళ్లేందుకు మేదరిపేట బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముందు టైరు ఆమె ఎడమకాలు పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జరుు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.