ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. మేడ్చల్ ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని బల్కంపేటలోని నివాసంతో పాటు కరీంనగర్, సిరిసిల్లలో ఉన్న ఇళ్లలో కూడా సోదాలు జరిపారు.
శ్రీధర్ కు రూ. 5 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 60 తులాల బంగారం, రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రెండు బ్యాంకు ఖాతాలు, లాకర్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది.