'ఆయన లేని లోటు పూడ్చలేనిది'
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. తన సహచరుడి మరణం తనను షాక్ కు గురిచేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మరో కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముండే హఠాన్మణం పట్ల ఎన్సీపీ అధినేత శరద పవార్ సంతాపం ప్రకటించారు. తన పాత స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేపోతున్నానని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ పేర్కొన్నారు. ముండే మరణం బీజేపీ, తమ పార్టీకి పెద్ద దెబ్బ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర మంచి నాయకున్ని కోల్పోయిందని నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ట్వీట్ చేశారు.