19న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ :
హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో ఈనెల 19న హిందీ మాధ్యమంలో ‘దక్షిణ్ భారత్ మే హిందీకీ ఆవశ్యకత’ అనే అంశంపై పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు హిందీ సేవా సదన్ వ్యవస్థాపకుడు ఎస్.గైబువల్లి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పేర్లను కార్యాలయంలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 6,7 తరగతులను జూనియర్స్ విభాగం, 8,9 తరగతులను సీనియర్స్ విభాగంగా విభజించబడునని తెలిపారు. జూనియర్స్ విభాగం వారికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సీనియర్స్ విభాగానికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు సెల్ : 98487 83787, 95813 86150లో సంప్రదించాలన్నారు.