Meer chowk
-
పాతబస్తీలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపూల్‌లో బుధవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని షకీల్ ఖురుషీగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. తన తల్లి, చెల్లిని అత్యాచారం చేసి చంపుతానని వేధింపులకు దిగడంతోనే ఓ పథకం ప్రకారం అబ్దుల్ ఖాజా ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ దారుణం జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉండటం గమనార్హం. కత్తితో ఖురుషీని అబ్దుల్ ఖాజా అతి కిరాతకంగా నరుతున్నప్పుడు అక్కడున్న వారందరూ చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకొనే సాహసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు ఖాజాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నెల క్రితం చోటుచేసుకున్న అత్తాపూర్ ఘటన మరవక ముందే నడి రోడ్డుపై మరో వ్యక్తి దారుణ హత్య నగరంలో కలకలం రేపుతోంది. -
తాగి డ్రైవింగ్ చేస్తూ.. 6 సార్లు పట్టుబడ్డాడు
కాచిగూడ: మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుసార్లు పట్టుబడిన సైదాబాద్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బలరామ్‌రాజు (42)కు 3నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపారు. 2012నుంచి ఇప్పటి వరకు మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, బహదూర్‌పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారని తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు జైలు శిక్ష అనుభవించిన బాలరామ్ రాజు మూడు సార్లు జరిమాన కూడా కట్టారని తెలిపారు. ఇన్నిసార్లు జరిమానాలు, జైలు కెళ్లివచ్చినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు.