Meerut woman
-
ఇదెక్కడి చోద్యం: భార్య లావైపోయిందని విడాకులు కోరిన భర్త!
లక్నో: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు యువకులు. కొందరు అనుకున్నట్లుగానే సన్నగా, అందంగా ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటారు. కానీ, పెళ్లయ్యాక లావెక్కితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన చేయరు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. పెళ్లయ్యాక తన భార్య లావైపోయిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో వెలుగు చూసింది. తాను లావైపోయాననే కారణంగా తన భర్త సల్మాన్ ఇంట్లోంచి వెళ్లగొట్టాడని తెలిపింది బాధితురాలు నజ్మా. మీరట్‌లోని జకిర్ కాలనీకి చెందిన నజ్మాకు ఎనిమిదేళ్ల క్రితం ఫతేపుర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే, పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరిగింది. దీంతో ఆమెను రోజు లావైపోయావని, నీలా ఎవరు బతకరంటూ భర్త వేధిస్తుండేవాడు. ‘నేను బరువు పెరిగిన కారణంగా నాతో జీవించాలని అనుకోవట్లేదని నా భర్త చెప్పాడు. విడాకుల పత్రాలు పంపించాడు. కానీ, నాకు అతనితోనే జీవించాలని ఉంది. విడాకులు వద్దు.’ అని వాపోయింది నజ్మా. డైవర్స్ పేపర్స్ పంపించిన తర్వాత తనకు న్యాయం చేయాలని లిసారి గేట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది బాధితురాలు నజ్మా. అయితే, ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలపటం గమనార్హం. తమకు సమాచారం అందితే.. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్వాలి మీరట్ సీఐ అరవింద్ చౌరాసియా. ఇదీ చదవండి: వైఫ్ అంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు -
బ్రేవ్ లేడి @ మీరట్
-
మీరట్ సాహసమహిళ ఆత్మహత్య చేసుకోవలసిందేనా?
మీరట్: ఈ దేశంలో సాహసమహిళలకు, వీరనారీమణులకు దక్కేది ఏమిటి? ఓ మహిళ తనను, తన భర్తను రక్షించుకోవడం కోసం దుండగులపై తిరగబడినా ఈ సమాజంలో సహాయపడేవారే లేరా? పోలీసులు, ప్రభుత్వం సహాయపడరా? బెదిరింపులు ...భయం భయంగా బతకవలసిందేనా? అంటే అంతే అని స్పష్టమవుతోంది మీరట్‌లో ఓ మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పట్టపగలు నడిరోడ్డు మీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొన్న సంఘటన తెలిసిందే. సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే.. మమత యాదవ్ అనే మహిళ తన భర్తతో కలసి బైకుపై వెళుతోంది. ఇద్దరు యువకులు వారి బైకును కారుతో ఢీకొట్టారు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమె భర్తపై దాడి చేశారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ పట్టపగలు రోడ్డుపై ఉన్నవారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడింది. ఆ యువకులకు దేహశుద్ధి చేసింది. ప్రాణాలకు తెగించి నడిరోడ్డుపై పోరాడుతున్న ఆ మహిళకు అక్కడ ఉన్న ఏ ఒక్క మగవాడు కూడా సహాయపడలేదు. ఆ సంఘటనను సెల్ ఫోన్ లో ఎక్కించడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ తరువాత పోలీసులు ఒక్క నిందితుడిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంతటి సాహసం చేసిన మమతకు ఆ సంఘట తరువాత న్యాయం జరుగలేదు. నిందితుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తన భర్తను రక్షించుకోవడం కోసం యువకులను చికతబాదిన మహిళ, ఇప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ సంఘటన మంగళవారం జరిగితే అంకిత్ అనే నిందితుడిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని మమత యాదవ్ చెప్పారు. మరో నిందితుడు సమాజ్‌వాదీ పార్టీ నేత అనుచరుడు అయినందున అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఆ రోజు నుంచి వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా నిందితుడి అరెస్ట్ చేయకుండా, తనకు సహకరించకుండా వేధిస్తున్నారని చెప్పారు. తాను ఏమీ మాట్లాడకుండా ఉంటే లక్ష రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పారని తెలిపారు. తనకు డబ్బు అవసరంలేదని, న్యాయం కావాలని ఆమె కోరారు. తన కుటుంబం భయంతో బతుకుతోందని మమత తెలిపారు. ఒక వారంలో తనకు న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు.