ఇద్దరివి కోసేసిన హిజ్రా
ఉత్తరప్రదేశ్‌లోని మీటర్ నగరంలో ఓ హిజ్రా.. ఇద్దరు యువకుల అంగాలను కోసిపారేసింది. ఓ పౌల్ట్రీ ఫాం వద్ద ఆ యువకులిద్దరూ స్పృహలేని పరిస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు తెలిపారు. దాంతో ఈ విషయం బయటపడింది. వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆ యువకులను సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన సబీర్, జాని ప్రాంతానికి చెందిన ప్రదీప్‌గా గుర్తించారు. రైల్వేరోడ్డు వద్ద తమకు నీలమ్ అనే హిజ్రా టీ ఇచ్చిందని, అది తాగిన తర్వాత తాము స్పృహ కోల్పోయామని సబీర్ చెప్పాడు. నీలమ్ బృందంలో సబీర్ డోలు వాయించేవాడు, ప్రదీప్ వంటవాడిగా పనిచేసేవాడని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు జరుపుతున్నామన్నారు.