చైనా సంస్థల అధినేతలతో నేడు కేసీఆర్ బృందం భేటీ
బీజింగ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన ఆరో రోజు కొనసాగుతోంది. నేడు రాజధాని బీజింగ్ నగరంలో పలు కంపెనీల అధినేతలతో కేసీఆర్ బృందం భేటీ అవుతుంది. చైనా రైల్వే కార్పొరేషన్, ఇన్సుపర్ గ్రూప్, చైనా ఫార్చూన్ ల్యాండ్, గ్రీన్ సిటీ లిమిటెడ్, శాని గ్రూపులతో సీఎం బృందం భేటీ అయి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడుల విషయంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న పరిస్థితులను చైనా సంస్థల అధినేతలకు సీఎం వివరించి, రాష్ట్రానికి వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.