నేటితో ముగియనున్న ఇస్కా సదస్సు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వేదికగా ఈ నెల 3న ప్రారంభమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు శనివారంతో ముగియనున్నాయి. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ హాజరవనున్నారని ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామో దరం తెలిపారు.
నాలుగు రోజులుగా ఇస్కాలోని అన్ని ప్లీనరీ, పార్లర్ సెషన్స్‌లో శాస్త్రవేత్తలు, మేధావుల ప్రసంగాలు అందరిని ఆకటు ్టకోవడంతో పాటు ఆలోచింపజేశాయని తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పా టుచేసిన మెగా ఎగ్జిబిషన్‌ను ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది తిలకించారన్నారు.