megha shree
-
చూడలేని ప్రేమ
సంచారి విజయ్ కుమార్, మేఘా శ్రీ జంటగా ఎస్ఏఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ తులసి’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో యం. నారాయణ స్వామి, నాగలక్ష్మిలు తెలుగులో ‘తులసి కృష్ణ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మొదటి సీడీని డైరెక్టర్ సాగర్‌కి అందజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకునే ఈ రోజుల్లో అంధుడైన హీరో, అందమైన యువతి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్ అద్భుతంగా చూపించాడు’’ అన్నారు. ‘‘కనులతో ప్రేమించే ప్రేమకన్నా మనసుతో ప్రేమించే ప్రేమ గొప్పది’’ అన్నారు డైరెక్టర్ సాగర్. ‘‘కథా బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కన్నడలో కంటే తెలుగులో గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎస్ఏఆర్ అన్నారు. ‘‘మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ‘తులసి కృష్ణ’ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత డాక్టర్ మహేంద్ర. నిర్మాతలు సాయివెంకట్, మోహన్‌గౌడ్ మాట్లాడారు. -
బాబోయ్ ‘కాకి’!
‘కాకి’ పేరుతో ప్రేక్షకులను భయపెట్టడానికి ఓ చిత్రం రానుంది. అశోక్, మేఘశ్రీ, శ్రుతీ రామ కృష్ణన్ ముఖ్యతారలుగా అర్పితా క్రియేషన్స్ పతాకంపై మనోన్ యం దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే వైజాగ్‌లో మొద లైంది. ముహూర్తపు దృశ్యానికి శ్రీమతి సంధ్య స్విచ్చాన్ చేయగా, నిర్మాత సోదరుడు పత్తికొండ కిశోర్ క్లాప్ నిచ్చారు. ‘‘లవ్, హర్రర్, థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఆసక్తికరమైన కథతో రూపొందించనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కథకుడు: రోనాల్డ్ రాజ్ ఎస్.విలియమ్స్. -
ఉత్కంఠ కలిగించే ప్రేమకథ
‘‘ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం’’ అని దర్శకుడు జె. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. శివ, మేఘశ్రీ జంటగా జె. ప్రభాకర్‌రెడ్డి, కొడాలి సుబ్బారావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వ హించారు. హీరో శివ మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ‘జగన్’ కమర్షియల్ హిట్టయింది. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’అని తెలిపారు.ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, సంగీతం: స్వరాజ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: వి. రవికుమార్.