Meghalaya State
-
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: 2023లో తొలి భాగంలో.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఒకే దఫాలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం మధ్యాహ్నం పాత్రికేయ సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు సీఈసీ రాజీవ్ కుమార్. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09, 651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా, జనరల్ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది. ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాలు.. 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి. Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq — ANI (@ANI) January 18, 2023 మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. త్రిపుర (Tripura)లో మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం, మేఘాలయా, నాగాలాండ్సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది బీజేపీ. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వతేదీల్లో ముగియనుంది. మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత వారం.. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ఈ మేరకు పక్కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. There are more than 62.8 lakh electors combined in Nagaland, Meghalaya & Tripura including - 31.47 lakh female electors, 97,000 80+ voters, and 31,700 PwD voters. Over 1.76 lakh first-time voters to participate in the elections in 3 states: CEC Rajiv Kumar pic.twitter.com/xnDne8TjQ1 — ANI (@ANI) January 18, 2023 -
మేఘాలయలో కాంగ్రెస్ ఖాళీ.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు..
షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు గిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతిస్తున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది. అంతకముందు వీరంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కూటమిలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు లేఖ అందించారు. కాంగ్రెస్‌ను వీడిన వారిలో ఆపార్టీ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్డోతోపాటు.. మేరల్‌బోర్న్ సీయొం, కింఫా ఎస్ మార్బనియాంగ్, మేహెన్ర్డోరాప్‌సాంగ్, పిటీ సాక్మీలు ఉన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ మేఘాలయ ప్రజాస్వామ కూటమిలో చేరాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఇదే లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పంపించారు. తాము అధికార కూటమిలో చేరినప్పటికీ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతామని సీఎల్పీ నేత అంపరీన్ లింగ్డో చెప్పడం గమనార్హం. ముఖ్యమత్రితో కలిసి అయిదురు ఎమ్మెల్యే దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు అయితే తాజా పరిణామంతో ప్రస్తుతం మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 60 మంది సభ్యులున్న శాసనసభలో నవంబరు వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో సహా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. మిగిలిన అయిదుగురు ఇప్పుడు ఎండీఏలో చేరారు. దీంతో మేఘాలయ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి! -
కరోనా: స్వయంగా రంగంలోకి దిగిన సీఎం!
షిల్లాంగ్: అగ్రరాజ్యంతో సహా ప్రపంచదేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కేంద్ర చర్యలతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్రాలు కూడా గట్టి చర్యలే తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా షిల్లాంగ్ విధుల్లోకి వచ్చి సామాజిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, పోలీసులకు సహకరించి వారు గీత గీసిన ప్రదేశాల్లోనే నిలబడాలని విజ్ఞప్తి చేశారు. మీ మంచికోసమే ఇదంతా చేస్తున్నామని వారికి అర్థమయ్యేలా వివరించారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రజలు పాటించేలా చూడాలి అని కూడా సంగ్మా పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మేఘాలయాలో ఒక్క కరోనా పాజిటివ్కేసు కూడా నమోదు కాలేదు. ఇది చదవండి: (కరోనా : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!) #WATCH: Meghalaya Chief Minister Conrad Sangma directs people to practice social distancing as a precautionary measure against #COVID19, at a locality in Shillong. (27.03.2020) pic.twitter.com/tFSgELRM0y — ANI (@ANI) March 28, 2020 ఇక ఇండియాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లోనే 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 873కి చేరింది. 21 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంకో 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కొవాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా భారత్ కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో అనేకమంది వలస కూలీలు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ ఇళ్లను చేరుతున్నారు. -
మేఘాలయకు తొలి రైలు
ప్రారంభించిన ప్రధాని.. స్టేషన్లను ప్రైవేటీకరిస్తామని వెల్లడి గువాహటి: స్వాతంత్య్రానంతరం సుదీర్ఘకాలం తర్వాత ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు శనివారం తొలిసారిగా రైలు వసతి అందుబాటులోకి వచ్చింది. మెందీపతార్-గువహటి ప్యాసింజర్ రైలును ప్రధాని మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు.అలాగే, మిజోరంలోని భైరాబి-సైరంగ్ రైల్వే మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌కు మార్పు చేసే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మౌలికవసతులు ఎంతో ముఖ్యమన్నారు. వందేళ్ల క్రితం రైల్వే వసతులు ఎలా ఉన్నాయో నేడూ అలానే ఉన్నాయని, రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించి, ఆధునీకరించాలని చెప్పారు. స్థలాల ధరలు పెరిగిపోయినందున రైల్వే తన పరిధిలోని స్థలాల్లో లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించేందుకు వీలుగా ప్రైవేటు పార్టీలను అనుమతించి, ఆదాయం పొందాలని సూచించారు. ముందుగా 10 నుంచి 12 స్టేషన్లను ప్రైవేటీకరించి, ఆధునీకరిస్త్తామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. జర్నలిస్టులు తేనెటీగల్లా ఉండాలి: మోదీ జర్నలిస్టులు ఈగల మాదిరిగా కాకుండా తేనెటీగల్లా ఉండాలని, ఒకవైపు తేనెను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు పరిశోధన కూడా కొనసాగించాలని మోదీ జర్నలిస్టులకు సూచించారు. గువాహటీలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ద అస్సాం ట్రైబ్యూట్’ ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. -
ప్రకృతి కట్టిన వంతెనలు
చిరపుంజి కింద నదీ ప్రవాహం.. పైన ప్రకృతి నిర్మిత వంతెనపై విహారం.. ఏడాది పొడవునా వానలు.. ఎత్తై జలపాతాలు.. పచ్చదనం పరుచుకున్న అడవులు.. దట్టంగా అలముకునే పొగమంచు.. వేడి అన్నదే లేని ఈ శీతల ప్రాంతం ఉన్నది మనదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి లో! ఉత్తర ఈశాన్య ప్రాంతమైన చిరపుంజిలో మావ్ లనోంగ్ గ్రామానికి వెళితే ప్రకృతి కట్టిన వంతెనలపై మీరూ అడుగులు వేయవచ్చు. భువిపై అత్యంత చిత్తడినేలగా పేరున్న చిరపుంజిలో రబ్బరు వృక్షాల నుంచి వచ్చిన వేర్లు ఇవి. ఒకదానికొకటి అల్లుకుపోయి, నదికి ఇటు వైపు నుంచి అటువైపుకు వంతెన కట్టాయి. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి, ట్రెకింగ్ చేయడానికి యువత ఆసక్తి చూపుతుంటారు. 100 అడుగుల పొడవులో, 50 మందిని మోయగల సామర్థ్యంతో ఉన్న ఈ బ్రిడ్జ్‌లు సుమారు ఐదారు వందల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటాయని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలా వెళ్ళాలి: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఎయిర్ పోర్ట్ ఉంది. గౌహతీకి రైలుమార్గం ఉంది. అక్కడి నుంచి చిరంపుంజికి 99 కి.మీ. గౌహతి రైల్వేస్టేషన్‌కు దగ్గరలో పల్టాన్ బజార్లో బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి షిల్లాంగ్‌కి, షిల్లాంగ్ నుంచి చిరపుంజికి బస్ సదుపాయాలు ఉన్నాయి. సందర్శనకు మే నెల వరకు అనుకూలం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా పడతాయి వేసవి ఉష్ణోగ్రత 13 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.