Mehrene
-
రాజా ది గ్రేట్ అవుతుంది
ద్వారకాతిరుమల : రాజా ది గ్రేట్ సినిమాను అన్ని వర్గాల ప్రజలు ద గ్రేట్ అనేలా నిర్మించామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న దీపావళి సెంటిమెంట్‌ను తాను బ్రేక్‌చేసి విజయాన్ని పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాజా ది గ్రేట్ చిత్ర యూనిట్ సభ్యులు సోమవారం సందడి చేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని శ్రీవారికి అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులు దిల్‌రాజు, హీరోయిన్ మెహ్రీన్‌కౌర్, దర్శకుడు రావిపూడి అనిల్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్‌లతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. హీరో రవితేజ అద్భుతంగా నటించారని దిల్‌రాజు అన్నారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ (ఏలూరు), సీతారామ్ తదితరులున్నారు. మద్ది హనుమను దర్శించుకున్న చిత్ర యూనిట్ జంగారెడ్డిగూడెం రూరల్: గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామిని సోమవారం రాజా ది గ్రేట్ చిత్ర యూనిట్ బృందం దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని మద్ది ఆంజనేయస్వామిని మొక్కుకున్నానన్నారు. -
అల్లుతో అందాల భామ!
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నటించిన మెహరీన్ గుర్తుందా? అందం, అభినయ పరంగా ఆ చిత్రంలో మంచి మార్కులే కొట్టేసింది. అందుకే మెహరీన్ రెండో సినిమా దక్కించుకోగలిగింది. అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఏంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన మెహరీన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు. ‘‘ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మెహరీన్ బాగా నటించడంతో తీసుకున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘మంచి కాన్సెప్ట్‌తో సాగే చిత్రం ఇది. లవ్ ఎంటర్టైనర్. అల్లు శిరీష్, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రదర్శకుడు ఎంవీఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు మా అన్నయ్య అల్లు అర్జున్‌తో ‘బన్నీ’ తీశారు. ఇప్పుడు ఆయన తనయుడి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
నాకిదో తియ్యని అనుభూతి!
‘‘నేను పుట్టింది పంజాబ్‌లో.. పెరిగింది ఢిల్లీలో. న్యూయార్క్‌లోనూ చదువుకున్నాను. ఏడాదిన్నర క్రితం ముంబై వచ్చాను. ఇప్పటివరకూ చాలా యాడ్స్‌లో నటించాను’’ అని చెప్పారు మెహరిన్. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రం ద్వారా ఆమె కథనాయికగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మెహరీన్ చెప్పిన ముచ్చట్లు... ♦ న్యూయార్క్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నేను కూడా చాలా చూశాను. వాటిలో ‘దూకుడు’ ఒకటి. అంత పెద్ద సినిమా నిర్మించిన 14 రీల్స్ సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. అందుకే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు అవకాశం వచ్చినప్పుడు స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది. నేను యాక్ట్ చేసిన యాడ్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి కాల్ చేసి, మేకప్ లేకుండా ఫొటోలు పంపించమని అడిగారు. పంపించాను. రెండు రోజుల పాటు ఆడిషన్స్ చేసి, చివరకు ఎంపిక చేశారు. ♦ ఈ చిత్రంలో నా పాత్ర పేరు మహాలక్ష్మి. నానీకి ప్రేయసిని. నాని న్యాచురల్ ఆర్టిస్ట్. నేను చూసిన తెలుగు సినిమాల్లో తను నటించిన ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్ చిత్రాలు ఉన్నాయి. నాకిది తొలి సినిమా కాబట్టి, పాత్ర కోసం సెట్లో డైలాగ్స్‌ను బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. షూటింగ్ ప్రారంభించక ముందే హను రాఘవపూడిగారు నన్ను మహాలక్ష్మీలానే డ్రెస్ చేసుకోమనేవారు. నా కాస్ట్యూమ్స్‌ని ఆయనతో కలిసి నేనే షాపింగ్ చేశాను. షూటింగ్ మొదలుపెట్టేసరికి మహాలక్ష్మిలానే మారిపోయాను. ♦ ఈ చిత్రం షూటింగ్ సమయంలో కాలికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. బ్యాండేజ్ వేసుకుని అలాగే షూటింగ్ పాల్గొన్నాను. దాంతో సమస్య పెద్దదైంది. దానివల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చింది. అది మినహా ఈ షూటింగ్ మొత్తం నాకో తియ్యని అనుభూతిలా మిగిలిపోయింది. ♦ నా నిజజీవితంలో కృష్ణ లేడు. ప్రస్తుతం నేను కెమేరాని మాత్రమే ప్రేమిస్తున్నాను. నాకు అనుష్క అంటే ఇష్టం. ఆమె యాక్ట్ చేసిన అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో చిత్రాలు చూశాను. ఆమెకు నేను వీరాభిమానిని. హిందీలోవచ్చిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘క్వీన్’ వంటివి చేయాలని ఉంది. నటనను ఫుల్ టైమ్ కెరీర్‌గా ఫిక్స్ అయ్యాను కాబట్టి, మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళతాను.