మేకా ప్రతాప్ సతీమణికి వైఎస్ జగన్ ఘననివాళి
నూజివీడు(కృష్ణాజిల్లా): నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి పార్థివదేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. మేకా ప్రతాప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు.
ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నూజివీడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో రామవరప్పాడు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. పేదలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ వెంట జిల్లా ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.