MEKAPATI candrasekharreddi
-
బాబుకు తగిన బుద్ధిచెబుతాం
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ మహిళలు ఆగ్రహం – గడప గడపకూ వైఎస్సార్‌లో తమ సమస్యలు విన్నవించిన ప్రజలు ఉదయగిరి: గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని పలువురు మహిళలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముందు కుండబద్ధలు కొట్టారు. ఉదయగిరిలో బుధవారం జరిగిన ‘గడప గడపకూ వైఎస్సార్’లో అనేకమంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నివిధాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందామని, టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి మెయిన్‌రోడ్డు, బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి బాబు వాగ్దానాలపై ప్రజా బ్యాలెట్‌ను స్థానికులకు అందజేసి మార్కులు వేయించారు. ఎక్కువ శాతం హామీలు పూర్తిగా నెరవేర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అబద్ధాలాడి అధికారం..మరచిన హామీలు అనంతరం స్థానిక పంచాయతీ బస్టాండు వద్ద జరిగిన సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు అనేక అబద్ధాలాడి పగ్గాలు చేపట్టిన తర్వాత అందులో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తెలుగుతమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు అర్హులకు మొండిచేయి చూపించి ప్రభుత్వ పథకాలను టీడీపీ వారికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బీడుభూములు సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు నిధులు మంజూరుచేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మార్కెట్ సుభాని, అక్కి భాస్కర్‌రెడ్డి, ఖిల్జీ సలీం, గడియాల్చి ఎస్ధాని, షంషీర్, చేజర్ల సుధాకర్‌రెడ్డి,గౌస్‌మొహిద్దిన్, ఏడుకొండలు, గొల్లపల్లి తిరుపతి, సోమిరెడ్డి, రమణారెడ్డి, నియోజకవర్గ నేతలు గణపం బాలక్రిష్ణారెడ్డి, ఆండ్రా బాలగురవారెడ్డి, గుంటుపల్లి నాగభూషణం, షేక్.అలీఅహ్మద్, పావులూరి మాల్యాద్రిరెడ్డి,బొల్లినేని సత్యనారాయణ, పాలవెల్లి మాలకొండారెడ్డి, యారం నరసింహరావు,పి.విజయభాస్కర్‌రెడ్డి, జి.పుల్లయ్య, తదితరులున్నారు. -
ఒక్క పక్కా ఇల్లు కూడా లేదు
సీతారామపురం: ఇంతవరకు ఒక పక్కాఇల్లు కూడా మంజూరు చేయలేదని సింగారెడ్డిపల్లి బీసీ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే మేకపాటì చంద్రశేఖర్‌రెడ్డి వద్ద వాపోయారు. మంగళవారం మండలంలోని సింగారెడ్డిపల్లి, ఎస్సీ, బీసీకాలనీలు, నాంచారంపల్లి గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సింగారెడ్డిపల్లి గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన 100 వాగ్దానాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా బ్యాలెట్‌లోని విషయాలను స్థానికులకు వివరించారు. వర్షం వస్తే ఉరుస్తున్నాయి 30ఏళ్ళ క్రితం ఇళ్లు నిర్మించుకున్నామని వర్షం వస్తే ఉరుస్తూ ఇంటిలో నీరు చేరుతున్నాయని సింగారెడ్డిపల్లివాసులు వాపోయారు. నాయకులకు, అధికారులకు సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనంలేదని పరిష్కారం చూపాలని మేకపాటిని కోరారు. ఈ సందర్భంగా మేకపాటి స్పందిస్తూ.. ఎంపీ రాజమోహన్‌రెడ్డి నిధుల్లో ఇంటికి రూ.10 వేలు అందజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరుగుదొడ్లు, ఉపాధి బిల్లులు రాలేదని కొందరు స్థానికులు విన్నవించగా.. సమస్యను పరిష్కరించాలని స్థానిక సర్పంచ్‌కు మేకపాటి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 అబద్ధాలుఆడి, ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మాట ఇస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డిలా కట్టుబడి ఉండాలని అన్నారు. ఇంతలో ఓ వృద్ధుడు స్పందిస్తూ ‘వాళ్ల నాన్న రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడైన అబద్ధాలు ఆడి ఉంటే కదయ్యా.. జగన్ నోటి నుంచి అబద్ధాలు వచ్చేది.. ఆ వారసత్వమే కదా.. చేయగలిగితేనే చెబుతాడు.’ అని అనడంతో ఒక్కసారిగా చుట్టూ ఉన్నవాళ్లు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాణెం రమణయ్య, గోరంట్ల తిరుపాలు, సర్పంచ్ డి.పెంచలమ్మ, ఉపసర్పంచ్ పాణెం సుధాకర్‌గౌడ్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గాజుల పల్లి రామ్మోహన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, మాజీ ఎంపీపీ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఒంగోలు పశువుల అందాల ప్రదర్శన
సాక్షి, నెల్లూరు(అగ్రికల్చర్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు సమీపంలో శుక్రవారం ప్రారంభమైన ఒంగోలు జాతి పశువుల అందాల ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. గిత్తల పాలపళ్ల విభాగంలో ఒకటి, రెండు, మూడు జతల పళ్ల విభాగాలకు, గిత్తల విభాగాలకు ఆదివారం పోటీలు నిర్వహించారు. ఆవుల విభాగంలో చాంపియన్‌గా నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన ఆవు, గిత్తల విభాగంలో కర్నూలు జిల్లా కాటం మురళీధర్‌కు చెందిన గిత్త చాంపియన్‌గా నిలిచింది. గిత్త యజమానికి కిలో వెండి, ఆవు యజమానికి అర కిలో వెండిని బహూకరించారు. రాత్రి జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలైన పశువుల యజమానులకు బహుమతులు అందజేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఒంగోలు జాతి పశు సంపదను వృద్ధి చేసేందుకు వారు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. న్యాయనిర్ణేతలుగా పశువైద్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకురెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.